ప్రొ. గాలి వినోద్‌ కుమార్‌కు విద్యా రత్న జాతీయ అవార్డు

నవతెలంగాణ-ఓయూ
విద్యారంగంలో ముఖ్యంగా న్యాయవిద్యలో అనేక సంస్కరణలు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఓయూ ఖ్యాతిని పెంచిన ఓయూ, తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ లా ప్రొఫెసర్‌ డాక్టర్‌ గాలి వినోద్‌ కుమార్‌కు ఇంటర్నేషనల్‌ ఇన్షానియత్‌ కిడ్‌ మత్‌ అంతర్జాతీయ సంస్థ విద్యారత్న 2024 జాతీయ అవార్డును సోమవారం రాత్రి రవీంద్ర భారతి లో జరిగిన అవార్డు ఫంక్షన్‌లో తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్‌ చైర్మెన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రయ్య ఇతర పెద్దల చేతుల మీదుగా అందజేశారు. అందుకు ఆ సంస్థ నిర్వా హకులకు ప్రో. వినోద్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ అవార్డు తన మీద మరింత బాధ్యత పెంచిందని, విద్యా రంగంలో పేద విద్యార్థులను ప్రపంచంతో పోటీపడే సాయికి తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. ప్రపంచ అత్యున్నత విశ్వవిద్యాలయాలైన కొలంబియా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ హార్వుడ్‌ ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించానని, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మానవ హక్కులు కుల వివక్షత భారత రాజ్యాంగం అనే అంశాలపై అనేక దేశంలో ప్రసం గాలు చేశానన్నారు. ఓయూ, టీయూ డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ స్థాయిలో న్యాయ శాస్త్రంలో పరిశోధన చేస్తున్న విద్యార్థుల నాణ్యత ప్రమాణ ప్రమాణాలు పెంచడానికి ఓయూ న్యాయ చరిత్రలో మొదటిసారిగా డీన్‌ అవార్డుతో పాటు పీజీ కోర్సుల్లో రెండు కొత్త కోర్సులు హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ క్రిమినల్‌ లా మూడు డిప్లమా కోర్సులు ప్రవేశపెట్టానని ఇంకా అనేక సంస్కరణలు న్యాయవిద్యలో తెచ్చి ఓయూను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సమానంగా పోటీపడే విధంగా విద్యార్థులకు లా స్టూడెంట్‌ మెరిట్‌ ఫెస్టివల్‌ జస్టిస్‌ ఆన్‌ వీల్స్‌ లాంటి వినూత్న ప్రోగ్రా మ్స్‌తో పాటు న్యాయవిద్యలో దేశంలోనే మొదటిసారిగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ లాగా లా ఎగ్జిబిషన్‌ కండక్ట్‌ చేశానని తెలిపారు. ఇది భారతదేశంలో తాను చేసిన మొదటి ప్రయోగమని అన్నారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు ముఖ్యంగా పేద విద్యార్థులకు స్ఫూర్తిగా ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Spread the love