రాజన్న దేవాలయ అధికారులు పుష్కరకాలంగా దాచిన విజిలెన్స్ రిపోర్ట్

– బీరువాలో దాచిన రహస్యం..!
– విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు 2016 లో ఫిర్యాదు..
– 2011 నుండి 2016 టెండర్ ఖరారులో  అవకతవకలు..
– అవినీతికి పాల్పడిన అధికారులను బదిలీ చేయాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రిపోర్టు..
– విజిలెన్స్ పక్కా ఇంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన నో యాక్షన్..
– ఎండోమెంట్ కమిషనర్ ని తప్పుదారి పట్టించిన దేవాలయ అధికారులు..
– అయ్యా సీఎం గారు జర ఈ అవినీతి అధికారుల బాగోతం చూడురి..
నవతెలంగాణ – వేములవాడ
“మనకు కష్టం వస్తే ఆ భగవంతునికి వేడుకుంటాం.. కష్టాలను, బాధలను వింటూ కష్టాలను బాధలు తీరుస్తాడని  దేవుడు పై నమ్మకం పెట్టుకుంటాం.. దశాబ్దాల కాలంగా మర్రివోడల నాటుకుపై అందిన కాడికి ప్రతి దాంట్లో దోచుకు తింటున్న అవినీతి ,అక్రమార్కులను  ఎందుకు చూడడం లేదు.. అవినీతి, అక్రమార్కులకు, దుర్మార్గులకు భగవంతుడు సైతం దూరంగా ఉంటాడు అనే ఒక సామెత ఉంది, అందుకే ఆ ముక్కంటి ధ్యానంలో  ఉన్నాడేమో”.. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయ అభివృద్ధికి జిల్లా కలెక్టర్, వి టి డి ఏ, స్థానిక ఎమ్మెల్యే, తో ఈ మధ్యకాలంలోనే రాజన్న దేవాలయ  అభివృద్ధికై సంకల్పించారు,రివ్యూ మీటింగ్  ఏర్పాటు చేశారు.. నిత్యం అవినీతి అక్రమార్జన పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి స్థాయి ఉద్యోగులు ఉన్న రాజన్న క్షేత్రం.. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులు ఉంటే టెంపుల్ డెవలప్మెంట్ సాధ్యం కాదు ఏమో అని పట్టణ ప్రజలు, భక్తులు విమర్శిస్తున్నారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పై సరైన విచారణ చేసి క్రమశిక్షణ చర్యలతో పాటు బదిలీలు చేయాలని కోరుతున్నారు.. దేశాన్ని పిడిస్తున్న భయంకరమైన వైరస్ కరోనా కాదు అంతకుమించి మహమ్మారి కరప్షన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు అవినీతి రహిత పాలన, సేవలు అందిస్తామని  పెద్ద పెద్ద ప్రసంగాలు దంచి కొడతారు, ఆచరణ మాత్రం శూన్యం..
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు 2016లో ఫిర్యాదు: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ఎంతో ఘన చరిత్ర ఉన్న రాజన్న కొలువున్న  క్షేత్రం.. అడ్డగోలు అవినీతి  అక్రమార్జన ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో పదోన్నతులు ఇలా అనేక వార్త కథనాలను చదివాము..2011-12, నుండి 2015-2016 వరకు రాజన్న దేవాలయంలో పల్లకి సేవ, తలనీలాలు, కోడిమొక్కులు, పారిశుద్ధ్యం నిర్వహించడానికి అధికారులు ఇ – ప్రొక్యూర్మెంట్, ఓపెన్ టెండర్లు ఇప్పుడు ఒకే పత్రికకు   ప్రకటన జారీ చేశారు. 2011-12, నుండి 2015-2016 వరకు రాజన్న దేవాలయంలో పల్లకి సేవ, తలనీలాలు, కోడిమొక్కులు, పారిశుద్ధ్యం నిర్వహించడానికి టెండర్ ఖరారులో అవకతవకలు, అవినీతి జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వేములవాడకు చెందిన పెంట బాబు 22-06-2016లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు..
రాజన్న దేవాలయ అధికారులు పుష్కర కాలంగా దాగిన విజిలెన్స్ రిపోర్ట్: బీరువాలో దాచిన రాజన్న దేవాలయ అధికారులు పుష్కర కాలంగా మరుగున పడిన టెండర్ ఖరార్ లో 2011-12, నుండి 2015-2016 వరకు జరిగిన అవకతవకలు, అవినీతి రహస్యాన్ని వేములవాడ రాజన్న దేవాలయ అధికారులు దాచిపెట్టిన వ్యవహారం పెంట బాబు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన విజిలెన్స్ అధికారులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత రికార్డులను 2011 నుండి 2016 వరకు టెండర్ డాక్యుమెంట్లతో సహా ఫైళ్లను టెండర్ ప్రక్రియలను విచారణ జరిపి వీరి బాగోతాన్ని చూసి, విని కంగు తిన్నంత పని అయిందని చెప్పాలి. దేవాలయ అధికారులు ఎమ్మె/స్ అంబేద్కర్ ఎస్సీ మ్యాచ్వల్లి ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్టర్ సిరిసిల్ల వారు చట్టంలోని సెక్షన్ 12(1) ప్రకారం కాంట్రాక్టర్ కార్మికులకు సప్లయ్ చేయడానికి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. దేవాలయ ఈవో చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. జీవో ఎంఎస్  నీటిపారుదల CAD(PW-COD) శాఖ ద్వారా ప్రభుత్వం జారీ చేసిన నెంబర్ 94 తేదీ 1-7-2003 శాఖ 50 లక్షల వరకు పనుల కోసం టెండర్ నోటిషలను అత్యధిక సర్కులేషన్ ఉన్న రెండు తెలుగు దినపత్రికల్లో జిల్లా ఎడిషన్ లో ప్రచారించాలని జీవో లో ఉంది. అధికారులు ప్రతిసారి ఒకే పత్రికకు ప్రకటన ఇస్తూ సర్కులేషన్ తక్కువగా ఉన్న పత్రికల్లో ప్రచురించేలా టెండర్ నోటీసులు ప్రచారణలో దేవస్థాన అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై అతనికి లాభం జరిగేలా ఏ విధమైన షరతులుపాటించలేదు అని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. రాజన్న దేవాలయ ఈవోకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి టెంపుల్, భద్రాచలం రాములవారికి బంగారు ఆభరణాలు తయారీ కోసం రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా దేవాలయ ఈవో  కు అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పని భారం కారణంగా టెండర్లను పరిశీలన కోసం ఏఈఓ ల పై ఆధారపడివలసి వచ్చిందని విజిలెన్స్ అధికారులకు ఈవో దూసరాజేశ్వర్  తెలిపారు, టెండర్ల ఖరారులో విఫలమయ్యారని నివేదికలో ఉంది. ఓ పత్రికలో ప్రచురించబడిన టెండర్ నోటిస్ లకు పెద్దగా ప్రచారం  లేకపోవడంతో ఇది కాంట్రాక్టర్కు లాభం చేకూరేలా జరిగింది. 2011 నుండి 2016 వరకు ముఖ్యంగా ఈవో, ఇద్దరు ఏఈవోలు కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970 లోని సెక్షన్ 12( 1) ప్రకారం లేబర్ డిపార్ట్మెంట్ నుండి ప్రాథమిక లైసెన్స్ లేని ఏజెన్సీకి కాంట్రాక్టర్ ఇవ్వాల్సిందిగా వారు సిఫార్సు చేసినట్లు ఆధారాలు ద్వారా స్పష్టమైనది, ఆలయ అధికారులు నిబ్బందాలను, మార్గదర్శకాలను పాటించలేదని విజిలెన్స్, ఇన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది, అది కాకుండా ఎండోమెంట్ కమిషనర్ సైతం తప్పుదోవ పట్టించినట్లు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలో తెలిపారు.
 విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 12 పేజీల నివేదికను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎక్స్ అఫీషియల్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి రాజీవ్ త్రివేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, రెవెన్యూ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్ ఈ విజిలెన్స్ రిపోర్ట్ నెంబర్ RVEO/KNR/C-27/2016 తేదీ. 31-03-2016 విచారణ చేసిన రిపోర్టును బదిలీలు చేశారు. అప్పటినుండి నేటి వరకు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టు బయటకు రాకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు, అని దేవాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.అప్పుడు ఈవో ,ఏవోలుగా పనిచేస్తున్న ఈవో రిటైర్డ్ అవ్వగా, డి. ఉమారాణి ఏఈఓగా పదవి విరమణ చేసిన అధికారినిది, రిటైర్డ్ అయినా  పింఛను కూడా నిలిపివేసినట్లు ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.మరో ఏఈఓ హరికిషన్ ఇప్పటికి విధులు నిర్వహిస్తున్నారు,  లడ్డు తయారీ కేంద్రంలో సూపర్డెంట్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన నామాల రాజేందర్, ఏఈఓ హరి కిషన్ పై నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు,  ఈ అధికారికి బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఓ పురోహితుడు దగ్గర బంధువు కావడంతో ఆయన ఏమి చేసినా ఆ అపురహితుడు ద్వారా మేనేజ్ చేసుకుంటూ రాజన్న క్షత్రంలో దీర్ఘకాలికంగా మర్రివోడల పాతుకుపోయారని రాజన్న ఉద్యోగులు చర్చించుకుంటున్నారు..
అయ్యా సీఎం గారు జర ఈ అవినీతి అధికారుల భాగోతం చూడురి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న రాజన్న క్షేత్రం లో ప్రతి శాఖలో అవినీతి ,అక్రమార్జన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో పదోన్నతులు వీరందరూ స్థానికులు కావడం స్థానిక నేతలతో, ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలు, ఫుల్ సపోర్ట్ దండిగా ఉండడంతో రాజన్న ఖజానాకు కన్నం పెడుతున్నారు అని ఆరోపణలు లేకపోలేదు.. రాజన్న దేవాలయ అధికారులు, ఉద్యోగుల పై ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఆడిటింగ్ శాఖల అధికారులు తనిఖీ చేసి వీరిపై రిపోర్ట్లను ఎండోమెంట్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు రిపోర్ట్ చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలకు తీసుకోలేదు..  కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న రాజన్న క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి అవినీతికి పాల్పడే అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు  బదిలీలు చేయాలని   పట్టణ ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.. గతంలో ఇచ్చిన రిపోర్టు మాదిరిగానే, వార్త కథనాల మాదిరిగానే  మరుగున పడేస్తారు,  లేక చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..
Spread the love