విజయభారతి మరణం సాహిత్యానికి తీరనిలోటు

– గౌరీ శంకర్‌, కోయి కోటేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకురాలు, బొజ్జా తారకం సతీమణి బోయి విజయభారతి మరణం సాహిత్యానికి తీరనిలోటని తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మెన్‌ జూలూరు గౌరీ శంకర్‌, ప్రముఖ కవి, విమర్శకుడు కోయి కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దళిత దృక్పథంలో నుంచి ప్రాచీన సాహిత్యాన్ని పునర్‌మూల్యాంకనం చేస్తూ ఆమె విలువైన గ్రంథాలను రాశారని పేర్కొన్నారు. అస్తిత్వ ఉద్యమాలకు కొత్త చూపును అందించాయని వివరించారు. దళిత తాత్విక భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో ఆమె కీలకమైన పాత్ర పోషించారని తెలిపారు. ఆమె అందించిన ప్రత్యామ్నాయతత్వాన్ని ప్రచారం చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆమె మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Spread the love