Monday, May 18, 2026
E-PAPER
Homeజాతీయంవిజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు: డీఎంకే ఎమ్మెల్యే

విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు: డీఎంకే ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వంపై డీఎంకే విమర్శల దాడికి దిగుతోంది. ఈ క్రమంలోనే సీఎం విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డీఎంకే చీఫ్ స్టాలిన్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్టాలిన్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కొలత్తూరును సింగపూర్‌లా మార్చినప్పటికీ అక్కడి ఓటర్లు విలువ లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -