విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : డిప్యూటీ NSA విక్రమ్ మిస్రీని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న వినయ్ క్వాట్రా పదవీ కాలం జులై 14తో ముగియనుంది. జులై 15న విక్రమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1989 బ్యాచ్‌ IFS అధికారి అయిన ఈయన గతంలో చైనా రాయబారిగా పనిచేశారు. గల్వాన్ ఘర్షణ జరిగినప్పుడు చైనాతో కమ్యూనికేషన్ కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు.

Spread the love