గ్రామస్తుల సహకారంతోనే గ్రామ అభివృద్ధి

నవతెలంగాణ – రాయపర్తి
ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో గ్రామస్తుల సహకారంతోనే గ్రామ అభివృద్ధి చేయడం జరిగిందని పెర్కవేడు సర్పంచ్ చిన్నాల తారశ్రీ రాజబాబు అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచ్ గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు, పాలకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ ప్రగతి సాధ్యమని  తెలిపారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని చేసిన మంచి పనుల ద్వారానే ప్రజలు పాలకులను గుర్తుచేసుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని చెప్పారు. ఐదు సంవత్సరాలు గ్రామానికి సేవచేసే అదృష్టం కల్పించిన ప్రజల సహకారం మరువలేనిదని కొనియాడారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా పాలనకు సహకరించిన ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, పంచాయతీ సిబ్బందికి, అంగన్వాడీ టీచర్లకు, మహిళా సంఘాల సీఏలకు, ఆశా వర్కర్లకు, రేషన్ డీలర్లకు, గ్రామస్థాయి ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love