హలియాలో విశ్వంభర సినిమా షూటింగ్ 

నవతెలంగాణ – హలియా
యువీ క్రియేషన్స్ సమర్పిస్తున్న, వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ శనివారం హాలియాలోని వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీస్లో నిర్వహించారు . రైస్ మిల్లులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు . ఉదయం 8 గంటలకే సినిమా షూటింగ్ మొదలు కావడంతో మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కార్యక్రమాల్లో మునిగిపోయారు. సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. చిరుతో పాటు ప్రముఖ ఆర్టిస్టులైన రాజా రవీంద్ర, హర్షవర్ధన్, వెన్నెల, కిషోర్, జబర్దస్త్ ఫేం చమ్మక్ చంద్ర, ప్రవీణ్, రోహన్, అకుల్, కుసుం తదితర ఆర్టిస్టులు రైస్ మిల్లులో జరిగిన షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Spread the love