అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నోటుకు.. ఓటు

– హోరాహోరీ పోరు, చితికిల పడ్డ కాంగ్రెస్, బీజేపీ
– క్యాంపునకు తరలిన ఎన్నికైన బీఆర్ఎస్ డైరెక్టర్ లు
– భారీగా మద్యం, డబ్బుల పంపిణీ
నవతెలంగాణ – సిరిసిల్ల
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటుకు నోటు తప్పనిసరి అయింది ఒక్కో అభ్యర్థి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు ఒక డివిజన్లో ఒక్క ఓటుకు రూ.8000 వరకు ఓటర్ కు ఇచ్చినట్లు సమాచారం పేద మధ్య తరగతి ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తున్నారనేది చెప్పుకోవచ్చు ప్రతి ఎన్నిక డబ్బుతో కూడిన ఎన్నికగా మారిపోయింది గత వారం రోజుల నుంచి సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారింది ఎన్నికకు ఒకరోజు ముందు డబ్బుల పంపిణీ చేశారు సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో జరిగిన హోరాహోరి పోరులో మళ్లీ భారత రాష్ట్ర సమితి విజయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపి పార్టీలు మూడు ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకొని ఎన్నికల బరిలో తలపడ్డారు. హోరా హోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ 8 డివిజన్ లలో విజయం సాధించగా,  బీజెపి, కాంగ్రెస్  పార్టీలు బలపరిచిన అభ్యర్థులు చెరొక స్థానానికి పరిమితమయ్యారు. ఇద్దరు స్వాతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. అనంతరం  మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించారు. బ్యాంకులో మొత్తం 6177 ఓటర్లు ఉండగా 4755 ఓట్ల పోలింగ్ జరిగి 77 శాతం నమోదు అయింది. 12 డైరెక్టర్ స్థానాల కోసం 61 మంది అభ్యర్థులు తలపడ్డారు.
ఎన్నికైన డైరెక్టర్లు
1వ డివిజన్ లో రాపెళ్లి లక్ష్మీనారాయణ (బీఆర్ఎస్), 2వ డివిజన్ లో గుడ్ల సత్యానంద్ (స్వతంత్ర) 3వ డివిజన్ లో చొప్పదండి ప్రమోద్ (కాంగ్రెస్), 4వ డివిజన్ లో అడ్డగట్ల మురళి (బీఆర్ఎస్), 5వ డివిజన్ లో పాటి కుమార్ రాజు (బీఆర్ఎస్), 6వ డివిజన్ లో బుర్ర రాజు (బీఆర్ఎస్), 7వ డివిజన్ లో వేముల సుక్కమ్మ (బీఆర్ఎస్),  8వ డివిజన్ లో అడ్డగట్ల దేవదాస్ (బీఆర్ఎస్), 9వ డివిజన్ లో  ఎనగందుల శంకర్ (బీఆర్ఎస్),  10వ డివిజన్ లో వలస హరిణి (స్వతంత్ర),  11వ డివిజన్ లో పత్తిపాక సురేష్ (బీజెపి), 12వ డివిజన్ లో కోడం సంజీవ్ (బీఆర్ఎస్) లు ఎన్నికయ్యారు.
క్యాంపునకు తరలిన డైరెక్టర్లు
అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో విజయం సాధించిన డైరెక్టర్ అభ్యర్థులు క్యాంపునకు తరలి వెళ్లారు. నాలుగవ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి అడ్డగట్ల మురళి ఎన్నికైనట్టు ప్రకటించారు. అయితే నాలుగు ఓట్లు మాత్రమే తేడా రావడంతో ఇక్కడ నుండి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి సూరం వినయ్ రీకౌంటింగ్ కు కావాలని ఫిర్యాదు చేయడంతో తిరిగి ఓట్లను లెక్కించారు. అయితే మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి అడ్డగట్ల మురళి ఎన్నికైనట్టు ప్రకటించారు. క్యాంపుకు తరలడానికి అర్బన్ బ్యాంకు లో గెలుపొందిన డైరెక్టర్లు బయటకు వస్తుండగా ఓ డైరెక్టర్ ను మరో డైరెక్టర్ కారులో ఎక్కించే ప్రయత్నం చేయడంతో అక్కడ రభస మొదలైంది గొడవ కావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు ఆ లాఠీ జార్జ్ లో అనేకమందికి దెబ్బలు తగలడంతో పాటు మూడవ డివిజన్ నుంచి గెలుపొందిన చొప్పదండి ప్రమోదు కు లాటి దెబ్బలు తగిలాయి ఈ విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ సంగీతం శ్రీనివాస్ మ్యాన ప్రసాద్ లు అక్కడికి చేరుకొని గెలుపొందిన డైరెక్టర్ ప్రమోద్ పై ఎలా లాటించార్జి చేశారని ఎందుకు చేశారని పోలీసులను ప్రశ్నించారు కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది పరిస్థితి ఉదృతంగా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని ప్రత్యేకంగా ప్రమోద్ పై లాఠీచార్జ్ చేయలేదని పోలీసులు పేర్కొనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ బిజెపి ఇద్దరు డైరెక్టర్లను తప్పించి మీద పదిమందిని క్యాంపుకు తరలించారు శుక్రవారం ఉదయం8.30 గంటలకు అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు.

Spread the love