ఓటరు… జెర్ర భద్రం!

ఓటరు... జెర్ర భద్రం!ఎన్నికల నగారా మోగింది
రాజకీయ క్రీడ మొదలైంది
ఇక స్వార్థ నేత గణాలు
ప్రచారాల హౌరెత్తిస్తారు

సభలు సమావేశాలతో
తెగ సందడి రేపుతారు
రంగు జెండాలు పట్టుకు
ఇళ్ల ముందు సాగిలబడి
పొర్లు దండం పెడతారు

బుద్ధిమంతుల్లా నటిస్తూ
విశ్వాసం పొందుతారు
హామీల మంత్రం జపిస్తూ
దొంగ జపం ఆచరిస్తారు

లిక్కర్‌ ఏరులు పారించి
మత్తులో ముంచేస్తారు
కరెన్సీ మూటలు పంచి
వినోదంలో దించేస్తారు

నయా నాటకాలు వేసి
ఓట్లు దండుకుంటారు
పాలక పీఠం అధిష్టించి
ఐదేళ్లపాటు పీడిస్తారు

దేశ సంపదలు కొల్లగొట్టి
వట్టి చిప్పను చేతిలబెట్టి
నడి రోడ్డున నిలబెడ్తారు

అందుకే ఓ ఓటరన్నా !
ముంచుకొచ్చే ముప్పు
ముందస్తుగానే పసిగట్టి
ఎన్నికలు ముగిసే వరకు
జెర్ర భద్రంగా మెదులన్నా!

(ఓటరు మహాశయులకు విన్నపంగా)

– కోడిగూటి తిరుపతి, 9573929493 

Spread the love