
మండలంలోని జంగంపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బృందం భూ పోరాట కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొప్పనిపద్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయుని చట్టాన్ని నీరు కారుస్తుందని ఇప్పటికే దేశ ప్రజల ఆస్తులను సగానికి పైగా అమ్మి, మతం పేరు మీద, కులం పేరు మీద, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో చేసిన అభివృద్ధి పనులను చూయించి ఓట్ల అడగాలి తప్ప దేవుళ్ళ పేరు చెప్పి ఓట్ల అడగడం సరికాదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని వ్యవసాయ రంగం దెబ్బతిందని ఉపాధి చట్టాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా నిధులు కేటాయించకుండా ఉపాధి హామీ కార్మికులను పొట్ట కొడుతుందన్నారు. అనంతరం వ్యకాస జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ ప్రజలు భూమి కోసం ఉద్యమించాలని పోరాటాలు తోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అంబాల స్వరూప, వ్యకస రాష్ట కమిటీ సభ్యురాలు లోకిని స్వరూప, గోలెం లక్ష్మి, నరసవ్వ, రుద్రబోయిన నర్సింలు, శ్యామల, రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.