యుద్ధాలు సైనికులతో కాకుండా సైబర్‌ దాడులతో జరుగుతున్నాయి

– జె.ఎన్‌.టీ.యు.హెచ్‌. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహా రెడ్డి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
జే.ఎన్‌.టీ.యూ.హెచ్‌ లో జె.ఎన్‌.టీ.యు.హెచ్‌. సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న వల్నరబిలిటీ అస్సెస్‌ మెంట్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టింగ్‌ అనే ఫ్యాకల్టీ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం శుక్రవారం ఘనంగా ప్రారం భమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జె.ఎన్‌.టీ.యు.హెచ్‌. వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహా రెడ్డి హజరై మాట్లాడుతూ సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌ చాలా ముఖ్యమైన అంశాలు వీటిని మానవ శ్రేయస్సుకు , మానవ వినాశనానికి రెండు విధాలుగా వాడొచ్చన్నారు.ఈ రోజుల్లో యుద్ధాలు సైనికులతో కాకుండా సైబర్‌ దాడులతో జరుగు తున్నాయని, వీటిని అరికట్టటానికి సైబర్‌ సెక్యూరిటీ చాలా అవస రమన్నారు. నోబెల్‌ శాస్త్రవేత్త డైనమైట్‌ ని మానవ శ్రేయస్సు కై కనుగొ న్నాడు. కానీ అది చెడ్డ వారి చేతిలో పడి మానవ వినాశనాన్ని సష్టిస్తుం దన్నారు. ఎథికల్‌ హ్యాకింగ్‌ కూడా మంచి కోసం వినియోగించ వచ్చన్నారు. సైబర్‌ సెక్యూరిటీ అవసరాన్ని జేఎన్టీయూ యూనివర్సిటీ గుర్తించి, సైబర్‌ సెక్యూరిటీ కోర్స్‌ను ప్రారంభించిందన్నారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుసేన్‌ మాట్లాడుతూ యుఎస్‌ఎ పర్యటనలో వివిధ యూనివర్సిటీల తోటి జే.ఎన్‌.టీ.యూ.హెచ్‌ ఎంఓయు కుదుర్చుకుందన్నారు. రెక్టార్‌. ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ మాట్లాడుతూ సైబర్‌ సెక్యూరిటీ గురించి, దాని అవసరాల గురించి వివరించారు. వల్నరబిలిటీ అస్సెస్‌ మెంట్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టింగ్‌ అనే ఫ్యాకల్టీ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం ఫ్యాకల్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డైరెక్టర్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంటర్‌ ప్రెన్యూయర్షిప్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ స్టార్టప్స్‌ . సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ శ్రీ దేవి సైబర్‌ సెక్యూరిటీ రంగంలో కషి చేశారని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్‌ గోవర్ధన్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుసేన్‌ లు అభినందించారు. ఈ వర్క్‌ షాప్‌లో జె.ఎన్‌.టీ.యూ. హెచ్‌. అనుబంధ , ఇతర కళాశాలల నుండి 44 మంది అధ్యాపకులు రిజిస్టర్‌ చేసుకు న్నారని, వీరికి ఎంటర్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ లీడ్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌, మనీశ్‌ దోమల, జయక్రిష్ణ సీనియర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌ ల చే ”వల్నరబిలిటీ అస్సెస్‌ మెంట్‌ అండ్‌ పెనెట్రేషన్‌ టెస్టింగ్‌” అంశంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని, ఈ కోర్స్‌ బీ.టెక్‌. సైబర్‌ సెక్యూరిటీ లో భాగమని, ఈ ఎఫ్‌.డీ.పీ లో పాల్గొన్న అధ్యాపకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఫ్యాకల్టీ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం కన్వీనర్‌, డైరెక్టర్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంటర్‌ ప్రెన్యూయర్షిప్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ స్టార్టప్స్‌, సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ శ్రీ దేవి తెలిపారు.

Spread the love