– శిథిలావస్థలో ఉన్న వాటర్ ఎక్కడ కూలిపోతుందన్న గ్రామస్తులు
– నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ లోకి నీరుని ఎక్కించాలి గ్రామస్తుల ఆవేదన
నవతెలంగాణ – మిరుదొడ్డి
వాటర్ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదని మిరుదొడ్డి మండలం మల్లు పల్లి గ్రామం చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లు పల్లి గ్రామంలో పాత వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని ఉన్నత అధికారులు తెలిపిన పట్టించుకోవడం లేదని గ్రామంలో అంటున్నారు. గ్రామంలో నూతనంగా నూతనంగా వాటర్ ట్యాంక్ ను నిర్మించిన ఉన్నతాధికారులు నీరును ట్యాంకులోకి ఎక్కించకుండా శిథిలావస్తున్న ట్యాంకు ఎక్కించడం వలన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన నిమ్మకు నేరెత్తినట్లు వివరించడం సరికాదని అన్నారు. మల్లుపల్లి గ్రామ చెందిన ప్రజలు ఉన్నతాధికారి తెలిపిన పట్టించుకోవడంలేదని ఆవేదనతో చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వాటర్ ట్యాంకు నిర్మాణం శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను తొలగించి నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కు నీరును ఎక్కియాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలిపోతుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును నీటి కలెక్షన్ ను కలుపాలని కోరారు.