కరెంట్ ఉంటేనే దాహార్తి తీర్చడానికి నీళ్లు

– మిషన్ భగీరథ నీరు పై అవగాహన లేక ఇక్కట్లు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

మండలంలోని బేగంపూర్ తాండ లో తాగే నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే తండాలో సుమారు 50 కుటుంబాల వరకు జీవనం కొనసాగిస్తున్నారు.అయితేతండాలో సింగల్ ఫేస్ మోటర్లు1ఉండడం వలన నీటిని పట్టుకోడానికి ప్రజలు గంటలు గంటలు లైన్లో నిలబడాల్సి వస్తుందని తాండలోని ప్రజలు పేర్కొన్నారు. కరెంట్ ఉంటేనే నీరు పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని కరెంటు లేకపోతే అంతే ఉండాల్సి వస్తుందని వాళ్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీరు  తాగడం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడంతో వాటిని తాండావాసులు వినియోగించుకోవడం లేదు ఒకే సింగిల్ ఫేస్ మోటర్ ఉండడంవల్ల ఇన్ని అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు. కరెంటు కూడా సమయానికి ఉండకపోవడం వలన పొద్దున పూట పనులకు పోవాల్సి ఉంటే నీటి కోసం ఎదురుచూస్తూ ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుందని వారు తెలిపారు. అత్యవసరంగా నీరు అవసరం ఉంటే  కిలోమీటర్ వరకు వెళ్లి వేరే గ్రామం నుండి తీసుకోవాల్సి వస్తుందని వారు తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి నీటి సమస్యను, మినీ వాటర్ ట్యాంక్ లను నిర్మించాలని వారు తెలిపారు.

Spread the love