మేము బాన్సువాడ పక్కా లోకల్

We are Bansuada Pakka Local– బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఎమ్మెల్యేనే ఉంటారు: మాజీ స్పీకర్ పోచారం
– ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్…
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకై కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇక్కడి కార్యకర్తలు అందరూ పక్క లోకల్ అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ తెలిపారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో ఎస్ ఎం బి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన, మరియు అభినందన సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు బాన్సువాడ నియోజకవర్గం లోని 10 మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా బాన్సువాడ పట్టణానికి రాక సందర్భంగా బాన్సువాడ కొయ్యగుట్ట అమరవీరుల విగ్రహం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజుకు స్వాగతం పలకడానికి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి భారీ ఎత్తున వాహనాలతో వెళ్లి వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీర్కూరు చౌరస్తాలో ఉన్న ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళన మరియు అభినందన సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంకు వలస వచ్చిన నాయకుడు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు నేను లేనిపోని కేసులు పెట్టిస్తున్నానని ఆరోపణ చేయడం సరికాదన్నారు. నేను ఎక్కడైనా ఏ పోలీస్ అధికారితోనైనా కేసులు చేయమని ఫోన్ చేసి ఉంటే ఆ విషయం బయట పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులను కార్యకర్తలను గుండెలో పెట్టుకొని చూస్తానన్నారు ఏ సమస్య అయినా తనకు నేరుగా సంప్రదించాలని సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
వలసనేత మాటలు వింటే నష్టమే.. కాసుల
రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గనికి వలస వచ్చిన నేత మాటలు విని  నియోజకవర్గ  కొందరు నాయకులు, కార్యకర్తలు తప్పుడు అడుగులు వేస్తున్నారని, మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు కృషి చేద్దాం అన్నారు. అందరూ రండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలోపేతం చేద్దామన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉంటారని ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఆయన అన్నారు మరి ఇతరులకు కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ వచ్చేది లేదని ఆయన అన్నారు. బాన్సువాడ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకునేవారు కరువున్న సమయంలో తాను గ్రామ గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో తనకు రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ పదవిని ప్రకటించడంతో వలస వచ్చిన ఒక నాయకుడు టిఆర్ఎస్ నాయకులతో కలిసి అసెంబ్లీని ముట్టడించారు అలాగే రాష్ట్ర మంత్రులను కలిసి నాకు చైర్మన్ పదవి రాకుండా చేసేందుకు కుట్ర పన్నిన నాయకుడి మాటలు నమ్మి కాంగ్రెస్ నాయకులు మోసపోవద్దని ఆయన సూచించారు.
బాన్సువాడ నియోజవర్గంలో సహజ సంపదను దోచుకెళ్లడానికి వలస నాయకుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కుట్ర కుతంత్రాల రాజకీయం చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గం లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభమైంది. 1977లో కాంగ్రెస్ కండువా వేసుకొని రాజకీయ జీవితం ప్రారంభించా. 1984 వరకు అందులోనే కొనసాగా. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశంలోకి వెళ్లి 27 ఏళ్లు పనిచేశా. తర్వాత 11 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశా. నా రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడే ముగింపునకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందే విధంగా కాంగ్రెస్ కుటుంబం కృషి చేయాలి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అంతా లోకల్ కాబట్టి నాయకులు కార్యకర్తలు లోకల్ వ్యక్తికి ఇవ్వాలని వలస వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తే నియోజకవర్గం లో ఉన్న సహజ వనరులను సంపదనను దోచుకెళ్లే అవకాశం ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అంటూ తేడా చూపకూడదని అందరూ కాంగ్రెస్ కుటుంబమే ,కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటారని , పోచారం, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు అన్నారు. ఈ  కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, సీనియర్ నాయకులు నార్ల రత్నకుమార్, ఖాలెక్, అలీబిన్ అబ్దుల్లా, కాసుల రోహిత్, ఎంపీపీ పాల్త్య విఠల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, ఎజాజ్, మోహన్ నాయక్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Spread the love