మేము చైనీయులం.. వెన‌క్కి త‌గ్గేదిలేదు: చైనా విదేశాంగ మంత్రి

maoన‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: మేము చైనీయులం..వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని, 1953 నాటి చైనా-అమెరికా వార్ వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆదేశ‌ విదేశాంగ మంత్రి మావో నింగ్ పోస్టు చేసింది. ‘ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో మనం నిర్ణయించుకోలేము, ఇది ఒకప్పుడు అధ్యక్షుడు ట్రూమాన్ మీద ఆధారపడి ఉండేది, అది అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మీద లేదా తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అది వారి ఇష్టం.ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగినా, మేము ఎప్పటికీ లొంగము. మేము పూర్తిగా విజయం సాధించే వరకు పోరాడుతాము’ అని ఆనాటి యుద్ధ స‌మ‌యంలో చైనా అధినేత మావో జెడాంగ్ చెప్పారు. తాము చైనీయులమని, అమెరికా కవ్వింపు చర్యలకు భయపడమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ టారిఫ్‌లపై వెనక్కి తగ్గమని ఆమె స్పష్టం చేశారు.

Spread the love