నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

– ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు శనివారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిరుద్యోగుల కోసం కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని,వారి డిమాండ్ల సాధనకోసం టీజీపీఎస్సి కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న నిరుద్యోగులను,విద్యార్థి సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని మండల నాయకులు అన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి గెలిచి,ఇప్పుడు మొహం చాటేయడం కాంగ్రేస్ ప్రభుత్వానికి తగదని,విద్యార్థుల,నిరుద్యోగుల, విద్యార్థి సంఘ నాయకుల అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం, తాజా మాజీ ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ జక్కని మధు సూధన్ , మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి , ఏర్గట్ల పీఏసీఎస్ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య , మండల నాయకులు పాల్గొన్నారు.
Spread the love