నీటి సమస్యల పల్లెలను గుర్తించి,  ప్రతిపాదనలు పంపించాం: ఆర్డబ్ల్యూఎస్ డీఈ హేమలత

నవతెలంగాణ – అచ్చంపేట
వేసవికాలం సమీపిస్తున్నడంతో త్రాగునీటి సమస్యలు ఉన్న పల్లెలను గుర్తించి సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వానికి , ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు ప్రణాళికలు సిద్ధం చేసి పంపించినట్లు అచ్చంపేట ఆర్డబ్ల్యూఎస్ డి ఈ హేమలత తెలిపారు. శుక్రవారం ఆమె నవతెలంగాణ తో మాట్లాడారు. గ్రామపంచాయతీలో ఉన్న వాటర్ ట్యాంకుల పరిశుభ్రతను స్పెషల్ ఆఫీసర్లకు గ్రామపంచాయతీ సెక్రటరీ లకు అప్పగించడం జరిగిందని గుర్తు చేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని లింగాల,  బలుమూరు, అమ్రాబాద్, అటవీ ప్రాంతంలోని చెంచు గుడాలను పరిశీలించి నీటి సమస్యలు గుర్తించి పరిష్కార మార్గానికి ప్రణాళిక రూపొందించి ప్రతి కుటుంబానికి అందించే విధంగా కృషి చేస్తున్నామని హేమలత తెలిపారు. వివిధ గ్రామాల్లో గుర్తించిన తాత్కాలిక సమస్యల మనమాత్తుల కోసం అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కొన్ని గ్రామ పంచాయతీలలో పైప్ లైన్  ల పనుల జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి ప్రతి కుటుంబానికి తగులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని వాటర్ ట్యాంకులను 15 రోజులకోసారి శుభ్రం చేయవలసిన బాధ్యత ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు , పంచాయతీ కార్యదర్శుల పైన ఉందని గుర్తు చేశారు. నీరు జీవకోటికి ప్రాణ ఆదరు. గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు, అటవీ ప్రాంతంలో నివాసం ఉన్న చెంచుగుడాలకు  గిరిజన తండాలకు ప్రత్యేక చదువుతో త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని డి ఈ హేమలత తెలిపారు. పల్లెల్లో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ప్రతి గ్రామపంచాయతీలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయవలసిన బాధ్యత గ్రామపంచాయతీ పైన ఉందని గుర్తు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలోని వాటర్ ట్యాంకులలో నీటిని పరీక్ష చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.  నియోజకవర్గాలని ఏజెన్సీ ప్రాంతాలకు గిరిజన తరాలకు చెంచుపేటలకు నిరంతరంగా త్రాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని దాని ప్రకారంగా ప్రతి కుటుంబానికి తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు కోసారి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయవలసిన బాధ్యత వారిపై ఉందన్నారు.
Spread the love