అన్ని వర్గాల వారికీ అండగా ఉంటం

– ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
నవతెలంగాణ-పరిగి
అన్ని వర్గాల వారికీ అండగా ఉంటామని ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్ట ణ కేంద్రంలోని తుంకుల గడ్డలోని స్మరణఫేత్‌ హౌంచర్చ్‌లో క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న దుస్తులను ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా కేక్‌కట్‌ చేసి అనంతరం ప్రభుత్వం ఏర్పా టు చేసిన క్రిస్మస్‌ ఇందులో ఆయన పాల్గొన్నారు. రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి నియోజకవర్గానికీ 1,000 దుస్తుల ప్యాకెట్లు అందజేస్తే పరిగి నియోజకవర్గానికి 3 వేల ప్యాకెట్లు తీసుకొచ్చానని తెలిపారు. ‘నేను అధికారంలో ఉన్నా లేకపోయినా మీ అందరి తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను’ అని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అంటేనే భిన్నత్వంలో ఏకత్వ మన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద ప్రజలం దరినీ కలుపుకోయేదే కాంగ్రెస్‌ అని అన్నారు. అందరికీ అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 6 గ్యారెంటీ పథకాలను ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రేపు ముఖ్యమంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పేద వర్గాల ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పరిగిలో క్రిస్టియన్‌ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమం తు ముదిరాజ్‌, వైస్‌ ఎంపీపీ కావలి సత్యనారా యణ, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, మండ లాధ్యక్షుడు పరశురాంరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కడుమూరి ఆనందం, చంద్ర య్య, ఆంజనేయులు, మాధవరెడ్డి, ఎజాస్‌, నాగ వర్ధన్‌, సుదర్శన్‌ పాస్టర్‌, డేనియల్‌ రాజ్‌, పాస్టర్‌ జాన్సన్‌, బుషప్‌ ఏసుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love