– పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్
నవతెలంగాణ-పరిగి
పరిగి మున్సిపల్‌లోని అన్ని వార్డులనూ అభివృద్ధి చేస్తామని పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కు మార్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని పు రపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సాధారణ సమావేశం నిర్వహించారు. అనంతరం పారిశుధ్యతోపుడు బండ్లు ప్రతి వార్డుకూ ఒకటి చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ముకుంద అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప రిగి మున్సిపల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పరిగి మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్‌పర్సన్ కల్లు ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, కమి షనర్ వెంకటయ్య, కౌన్సిలర్స్ అర్చన రవికుమార్, వాసియా తబస్సుమ్ మౌలాన, వేముల కిరణ్ కుమార్, వారల రవీంద్ర, బొంబాయి నాగేశ్వర్, తంగడపల్లి వెంకటేష్, గొల్ల రాములమ్మ, శబనూర్ సుల్తానా రియాజ్, జరుపుల శ్రీనివాస్, ఎదిరే కృష్ణ, మునీర్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, మీర్ తాహేర్ అలీ, కో ఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్, షైక్ ముజామిల్, సానియా సుల్తానా అన్వార్, పురపాలక అధి కారులు మేనేజర్ సంపత్ కుమార్, అన్ని వార్డుల వార్డ్ ఆఫీసర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.