ప్రజా తీర్పును గౌరవిస్తాం: ఎండీ జహంగీర్

– సీపీఐ(ఎం) ను ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు
– ప్రజా పోరాటాలు ఆగవు
నవతెలంగాణ – భువనగిరిభువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఈ ఎన్నికలలో సీపీఐ(ఎం) ను ఆదరించిన ఓటర్లకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రజలే సీపీఐ(ఎం) కు విరాళాలు ఇచ్చి ఓట్లు వేశారని తెలిపారు. గతంలో కన్నా అధికంగా ఓట్లు వేసి ఆదరించాలని వారికి కృతజ్ఞతలు తెలిపారు.  భువనగిరి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సీపీఐ(ఎం) ఎన్నికల్లో పోటీ చేయడానికి మూడు లక్షలతో ముందుకు వచ్చిందన్నారు. సీపీఐ(ఎం) చరిత్రను విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న లక్ష్య ని సాదించామన్నారు. మొదటిది ప్రజా పోరాటాలు వచ్చిన ఫలితాలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు వీటితోపాటు ఇతర పార్టీలు చేస్తున్న అవినీతి అక్రమాల పడ్డారని బయట పెట్టామని తెలిపారు.  జిల్లాలో ప్రజా పోరాటాలు ప్రజల కోసం చేసిన త్యాగాలు కమ్యూనిస్టు నిర్వహించిన భూపోరాటాలు ఇళ్ల స్థలాలు కార్మిక, వ్యవసాయ పోరాటాలను వివరించగలిగామన్నారు. రాజకీయంగా సీపీఐ(ఎం) ను ప్రతిష్టను పెంచగలిగామని ఆనందం వ్యక్తపరిచారు.
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వైఫల్యాలను వాగ్దానాలను మతోన్మాద ఆర్థిక రాజకీయాలని ప్రజలకు పూస గుచ్చినట్లు చెప్పి వారిని చైతన్యవంతం చేయడంలో విజయవంతమైనట్లు తెలిపారు .  భువనగిరి పార్లమెంటు పరిధిలోని 185 ప్రాంతాలలో బహిరంగ సభలో రోడ్ షోలో తను పాల్గొన్నానని తెలిపారు.  తమ ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర కమిటీకి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తోపాటు మండల, గ్రామ కమిటీలకు, పార్టీ సానుభూతిపరులకు శ్రేయోభిలాషులకు,  తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎండి జహంగీర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీపీఐ(ఎం) కి వచ్చిన ఓట్లపై సమీక్ష చేసి లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపారు. భువనగిరి ఎంపీగా ఎన్నికైన చామలె కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకురావాలని కోరారు. ఎయిమ్స్ వైద్యశాలలో పూర్తిస్థాయిలో సేవల కొరకు పోరాటం చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల తో పాటు మెట్రో, ఎమ్ ఎమ్ టి ఎస్ రైళ్ల రాక కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ ఇబ్రహీంపట్నం కు రైలు వసతి కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీ అమలయ విధంగా కృషి చేయాలని కోరారు. మా పోరాటాలకు పదును పెట్టి ప్రజలకు మరింత పెద్ద ఎత్తున సేవలు చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, కల్లూరు మల్లేశం, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొన్నారు.

Spread the love