కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి 

A welfare board should be established for all workers.నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి అని నిజామాబాద్ జిల్లా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా పరిధిలో స్థానికలోని నిజామాబాద్ కాకతీయ అడ్డా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF) సిఐటియు ( అనుబంధo) యూనియన్ నిజామాబాద్ జిల్లా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం (ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్) సిఐటియు ఎల్లప్పుడూ అండగానిలబడుతూ పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. అదే విధంగా రవాణా రంగంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా అర్హులైన వాళ్లందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, ప్రమాద భీమా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. 2019 మోటార్ వెహికల్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. 29 లేబర్ కోడ్ లను పునరుద్ధరించాలి. నాలుగు లేబర్ కోడ్ లు రద్దుచేయాలి. తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రెండు దఫాలుగా ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. రవాణా రంగ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అని వాగ్దానం చేశారు .ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచలేదు దీనికి నిరసనగా ఈనెల 21వ తేదీన రవాణా రంగం కార్మికులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆటో, ట్రాలీ, లారీ, డీసీఎం, బస్సు మొదలగు రవాణా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క డ్రైవరు,హెల్పరు, వర్కరు పాల్గొన్నారు. అదేవిధంగా మార్చి 24వ తేదీన చలో పార్లమెంటు దేశవ్యాప్త కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. ఆటో డ్రైవర్ల అందరికీ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఆటో స్టాండ్ అడ్డా కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆర్టిఏ, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పండరి విట్టల్, అబ్దుల్ అమిత్, ఇమ్రాన్, ఎండి అస్లాం, ఎండి అశ్వక్,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love