2024లో టెక్స్టైల్, అపెరల్ & లగ్జరీ గూడ్స్ విభాగంలో అత్యధిక ESG రేటింగ్‌ను సాధించిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్

నవతెలంగాణ ముంబై: హోమ్ టెక్స్టైల్ విభాగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ ఆయిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (WLL), సస్టైనబిలిటీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంటూ , 2024 S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ (CSA)లో మొత్తం ESG స్కోరు 83ని సాధించింది. ఈ గుర్తింపు టెక్స్టైల్ , అపెరల్ & లగ్జరీ గూడ్స్ విభాగంలో భారతదేశం నుండి అత్యున్నత ర్యాంక్ పొందిన టెక్స్టైల్ సంస్థగా WLL యొక్క నాయకత్వాన్ని మరింత బలపరుస్తుంది. ఈ స్కోరు వెల్‌స్పన్ లివింగ్‌ను CSAలో ముందుగా పేర్కొన్న విభాగం లో  ఈ ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంచింది.  ఈ కంపెనీ, 2023లో 66 స్కోర్ నుండి 26% మెరుగుదలతో 2024లో 83 స్కోర్ సాధించింది. ఇది పర్యావరణ అనుకూల వ్యాపార విధానాలు మరియు బాధ్యతాయుతమైన వృద్ధిపై దాని నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది.

WLL యొక్క అద్భుతమైన ప్రదర్శన మూల్యాంకనం యొక్క మూడు కీలక విభాగాలు – పాలన & ఆర్థికం (79), పర్యావరణం (85) మరియు సామాజిక (84)- లో ప్రతిబింబిస్తుంది.  పర్యావరణ అనుకూల తయారీ పద్ధతులు ,  వనరుల సేకరణ లో నైతికత  మరియు పర్యావరణ సారథ్యంలో కంపెనీ నిరంతర పురోగతులు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆవిష్కరణ, పారదర్శకత, మరియు వృత్తాకార ఆర్థిక విధానాల పై వ్యూహాత్మక దృష్టితో WLL,  సస్టైనబిలిటీని తన ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో సమగ్రంగా పొందుపరిచింది.

వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ ESG ప్రదర్శనలో పరిశ్రమ ప్రమాణాలను అధిగమించింది. ఇది పర్యావరణంలో 85 (పరిశ్రమ సగటు:  34, అత్యధికం: 96),  సామాజికంలో 84 (సగటు: 34, అత్యధికం: 91), మరియు పాలన & ఆర్థికంలో 79 (సగటు: 38, అత్యధికం: 88) స్కోర్ చేసింది. ఈ స్కోర్‌లు పరిశ్రమలో సస్టైనబిలిటీ  మరియు శ్రేష్ఠతలో వెల్‌స్పన్ లివింగ్ నాయకత్వాన్ని వెల్లడిస్తాయి.

S&P గ్లోబల్ (DJSI) ESG స్కోర్
2023 2024
మొత్తం 66 83
పాలన & ఆర్థికం 70 79
పర్యావరణం 64 85
సామాజిక 61 84

ఈ విజయంపై వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ ఎండి & సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ : “ఈ సంవత్సరం ఎనభై మూడు స్కోరుతో S&P CSAలో  టెక్స్టైల్ , అపెరల్ & లగ్జరీ గూడ్స్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానాన్ని సాధించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విజయం మా మొత్తం బృందం యొక్క కృషి , అంకితభావానికి నిదర్శనం, వారు మా వ్యాపారంలోని ప్రతి అంశంలో పర్యావరణ అనుకూల వ్యాపార విధానాలను ఏకీకృతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.  బాధ్యతాయుతమైన వృద్ధి అనేది  ఆవిష్కరణ మరియు పారదర్శకతతో కలిసి ఉంటుందని వెల్‌స్పన్ లివింగ్‌  వద్ద మేము విశ్వసిస్తున్నాము. పర్యావరణ అనుకూల  తయారీలో నాయకత్వం వహించడానికి , పరిశ్రమలో నూతన ప్రమాణాలను నిర్దేశించటానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.
అధ్యక్షుడు & గ్రూప్ హెడ్ – సస్టైనబిలిటీ,  అలోక్ మిశ్రా మాట్లాడుతూ : “మా ESG స్కోర్‌లో ఈ అద్భుతమైన మెరుగుదల కంపెనీ యొక్క ESG ప్రమాదాలను సమగ్రంగా పరిష్కరించడానికి , భవిష్యత్తుకు సిద్ధంగా వున్న  సంస్థగా తీర్చిదిద్దటానికి  మేము చేసిన ప్రయత్నాల ఫలితం. ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ నిర్వహణ పరస్పరం అనుసంధానమై ఉన్నాయనే మా నమ్మకానికి ఇది రుజువు. మెరుగైన ప్రపంచం కోసం ప్రభావ ఆధారిత పరిష్కారాలను సృష్టించడం అనే మా దీర్ఘకాలిక లక్ష్యం  వైపు పనిచేయడం కొనసాగించడానికి ఈ విజయం మమ్మల్ని తిరిగి శక్తివంతం చేస్తుంది..” అని అన్నారు.  ప్రపంచ వ్యాపార దృశ్యాన్ని సస్టైనబిలిటీ రూపొందిస్తూనే వుంది , వెల్‌స్పన్ లివింగ్ దాని ESG కార్యక్రమాలను మెరుగుపరచడానికి, వస్త్ర పరిశ్రమలో బాధ్యతాయుతమైన వృద్ధికి కొత్త ప్రమాణాలను నిర్దేశించడానికి అంకితభావంతో ఉంది. కంపెనీ యొక్క వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ డీకార్బనైజేషన్, నీటి సంరక్షణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక సాధికారతపై దృష్టి పెడుతుంది, దీర్ఘకాలిక విలువ సృష్టి వైపు సమగ్ర విధానాన్ని నిర్ధారిస్తుంది.

Spread the love