Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘రంభ ఊర్వశి మేనక’ నిజంగా దిగొస్తే?

‘రంభ ఊర్వశి మేనక’ నిజంగా దిగొస్తే?

- Advertisement -

అల్లరి నరేష్ నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ మీడియాతో ముచ్చటించారు. ఒక వ్యక్తి తనకు అనుకున్నది జీవితంలో సాధించాలనుకుంటాడు. హీరో కావాలనేది అతని కోరిక. అందుకోసం హైదరాబాద్, చెన్నై వెళ్లి ప్రయత్నించాలి. కానీ తాను ఉన్న ఊర్లోనే ఉండి హీరో అవ్వాలని అనుకుంటాడు. ఏదో ఒక మ్యాజిక్ జరిగి తన కోరిక నెరవేరాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో అతని కుటుంబంలో ఉన్న ఒక పుస్తకం గురించి తెలుసుకుంటాడు. ఆ పుస్తకంపై ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని కరెక్ట్‌గా గీస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. దాని కోసం అతను దాదాపు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటాడు. చివరికి నిజంగానే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారు. వాళ్లు దిగకముందు ఏం జరిగింది?, దిగిన తర్వాత ఏం జరిగింది? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల ఎపిసోడ్‌ను నేను ఇప్పటివరకు ఎక్కడా రివీల్‌ చేయలేదు. అది ఆడియన్స్‌కు బోనస్‌గా ఉంటుంది. నరేష్ కామెడీ యూనివర్సల్‌గా అందరికీ నచ్చుతుంది. గత కొంతకాలంగా ఆయన విభిన్నమైన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ తన కంఫర్ట్ జోన్‌లోకి వస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ కామెడీ ఫుల్ ర్యాంపేజ్‌లో ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ చాలా జెన్యూన్‌గా, ప్యూర్‌గా ఉంటుంది. ఆరోగ్యకరమైన నవ్వులు ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఒక సామాన్య మనిషికి, దేవతల రాజు ఇంద్రుడికి మధ్య జరిగే సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా, వినోదాత్మకంగా ఉంటాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాలో దాదాపు 35 నిమిషాల వరకు సీజీ వర్క్ ఉంటుంది. ఈ విషయంలో నిర్మాతలకు థాంక్స్ చెప్పాలి. నాకు కావాల్సిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -