Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం ఆసక్తికరంగా ఉండే కథ

ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే కథ

- Advertisement -

రవితేజ నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర మీడియాతో ముచ్చటించింది. నా పేరు నక్షత్ర. మాది కేరళ. నేను ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను. దర్శకుడు శివ నిర్వాణ ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్స్ చూసి సంప్రదించారు. ఇది నా తొలి తెలుగు సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది అయ్యప్ప స్వామి నేపథ్యంలో ఉన్న కథ. రవితేజతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇందులో నా పాత్ర పేరు మణికంఠ. నేను రవితేజ కూతురిగా కనిపించ బోతున్నాను. ప్రియా నా తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్వయంగా డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమాలోని పాటలన్నీ నాకు ఇష్టం. ముఖ్యంగా ‘యాలో యాలో’ పాట నా ఫేవరెట్. శివ నిర్వాణ సపోర్ట్‌తోనే ఈ సినిమాను చాలా కాన్ఫిడెంట్‌గా చేయగలిగాను. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -