అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ,‘ఈ సినిమాని ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేశాను. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశాం అని అర్థమైంది’ అని అన్నారు.
‘నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తున్న నా భర్త రమణకి థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ సినిమాని అందమైన పెయింటింగ్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు’అని నిర్మాత మాధవి రెడ్డి సోమ చెప్పారు. నటుడు ఎంసి హరి మాట్లాడుతూ,‘ఈ సినిమా నాకు మంచి అవకాశాన్ని, కుటుంబాన్ని, అనుభవాన్ని ఇచ్చింది. ప్రీమియర్లు వేసిన ప్రతీ చోటా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. రిలీజ్ అయ్యాక మాకు అదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



