డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా, దర్శకుడిగా మహేష్ ఉప్పల పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా, అనస్వర రాజన్ చేతులు కట్టబడి, విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో అనీష్ చెవిటి, మూగ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నేపథ్యం కథలో ఆసక్తికరమైన అంశాన్ని యాడ్ చేస్తోంది.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఏ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కోటి కే ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



