Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసూర్య నమ్మకాన్ని నిజం చేసింది

సూర్య నమ్మకాన్ని నిజం చేసింది

- Advertisement -

సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శ కత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సిని మాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడు తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ,‘మా సినిమాకి మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్యకి చాలా నచ్చేసింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాం. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. అంతేకాదు ఆయన నమ్మకాన్ని నిజం చేసిన సినిమా కూడా. ప్రేక్ష‍కులు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -