Tuesday, March 24, 2026
E-PAPER
Homeమానవివంటనూనె కొనేటప్పుడు..!

వంటనూనె కొనేటప్పుడు..!

- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో ప్రధానంగా వంట నూనె. నూనె ప్యాకెట్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్‌గా ఉండటానికి, డైట్‌ ప్లాన్‌ సరిగ్గా ఉండాలి. నూనె మంచిది కాకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే వంట నూనె కొనే ముందు, కొన్ని అంశాలపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నూనె లేకుండా వంట చేయడం చాలా కష్టం. కానీ ఒక వ్యక్తి ఒక రోజులో మూడు లేదా నాలుగు టేబుల్‌ స్పూన్ల కంటే ఎక్కువ నూనెను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇది తెలిసినప్పటికీ, దానిని పాటించరు. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలు ఉన్నాయి. ఏదైనా నూనె కొనే ముందు, మనం మూడు విషయాలను పరిశీలించాలి.

ఏం చెక్‌ చేయాలి?

నిజానికి.. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ ప్రోటీన్లు, చక్కెరలు, కేలరీల గురించి మాట్లాడతారు. అవును.. ఈ మూడు అంశాలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యమైనవి. ఈ మూలకాల సమతుల్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. కానీ ఈ మూడింటితో పాటు మరో ముఖ్యమైన విషయం నూనె. అది సరైనది అయితేనే, ఆరోగ్యంగా ఉంటాం. నూనె కొనే ముందు ఫస్ట్‌ చెక్‌ చేయాల్సింది అది కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ కాదా..? అనేది చూడాలి

కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్‌ ఎందుకు?
సాధారణంగా, కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ నూనెను వేడి చేయకుండా తయారుచేస్తారు. అంతేకాకుండా వాటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. యాంటీఆక్సి డెంట్లు కూడా ఉంటాయి. అంతే కాదు వాటిలో విటమిన్‌ ఇ, పాలీఫెనాల్‌ కంటెంట్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఉపయోగించడం చాలా మంచిదని అంటారు. ఈ రకమైన నూనెలో ఉండే యాంటీఆక్సి డెంట్ల కారణంగా శరీరంలో పేరుకుపోయిన విషపూరితాలు సులభంగా తొలగిపో తాయి. అంతేకాకుండా ఈ నూనెతో వంట చేయడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కొలెస్ట్రాల్‌ సమస్య కూడా ఉండదు.

స్మోక్‌ పాయింట్‌
వంట నూనె కొనేముందు తనిఖీ చేయవలసిన మరో ముఖ్యమైన విషయం స్మోక్‌ పాయింట్‌. నూనె ఆరోగ్యంగా ఉందా లేదా అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం మన వంటలన్నింటినీ అధిక వేడి వద్ద వండుకుంటాము. వేయించడం, వివిధ స్నాక్స్‌ వంటివి ఉదాహరణలు. అలాంటి వాటిని వండేటప్పుడు.. నూనె 230 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మీరు ఎంచుకున్న నూనె ఈ వేడిని తట్టుకోగలదా లేదా అనేది. అంటే, మీరు కొనుగోలు చేసే నూనె ఈ స్మోక్‌ పాయింట్‌ను తట్టుకోలేకపోతే, ఇది శరీరంలో హానికరమైన వివిధ రసాయనాలు ఏర్పడటానికి దారితీస్తుంది.

రెండు లేదా మూడురకాల నూనెలు..
వంట కోసం ఒకే నూనెపై ఎప్పుడూ ఆధారపడకూడదు. అటువంటి నూనెలలో పోషకాలు ఉన్నప్పటికీ, అవి మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచలేవు. అందుకే రెండు లేదా మూడు రకాల నూనెలు వాడటం మంచిది. దీనివల్ల శరీరానికి అన్ని పోషకాలు లభించే అవకాశం లభిస్తుంది. మొత్తంమీద నూనె కొనేటప్పుడు ఈ మూడు విషయాలను మీరు తనిఖీ చేస్తే, ఆరోగ్యంగా ఉండవచ్చు. దానితో పాటు నూనె వాడకంలో కొన్ని పరిమితులు విధించుకోవడం మంచిది. వీలైనంత వరకు నూనె పదార్థాలకు దూరంగా ఉంటే, అది ఆరోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -