పెద్దపల్లి పార్లమెంటు బరిలో నిలిచేదెవరు..?

– పార్లమెంటు సీటుకు పెరుగుతున్న పోటాపోటీ…
– పార్లమెంటు అభ్యర్థుల ప్రకటనపై పార్టీల కసరత్తు..
నవతెలంగాణ – మంథని
పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇంద్రవెల్లి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించగా,బీజేపీ విజయ సంకల్ప యాత్ర తో ముందుకు సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేసి అభ్యర్థుల ప్రకటన ప్రకటించే అవకాశం కోసం చూస్తుంది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించే వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది.పెద్దపల్లి ఎంపి టికెట్ తమకే ఎవరికి వారే భావిస్తున్న తరుణంలో కొత్త కొత్త పేర్లు వినబడుతున్నాయి.పెద్దపల్లి స్థానం నుండి మొదటి నుండి టికెట్ ఆశించిన గడ్డం వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊహించని విధంగా చెన్నూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు.అసెంబ్లీ టికెట్ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ తన కుమారుడు వంశీకృష్ణకు ఇవ్వాలని మాట తీసుకొని అసెంబ్లీకి పోటీ చేసినట్లు సమాచారం.రాష్ట్ర మంత్రివర్గంలో స్థానాన్ని కూడా తన తమ్ముడికి పార్లమెంటు టికెట్ కోసం వదిలి పెట్టుకున్నారని ప్రచారం జరుగుతుంది.ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు పోటా పోటీ పెరుగుతుంది.సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బొర్లకుంటవెంకటేష్ నేత, గడ్డంవంశి,డాక్టర్ చెలిమలసుగుణకుమారి, మాజీ సర్పంచ్ న్యాయవాది,బూడిద మల్లేష్,ప్రముఖ వ్యాపారవేత్త ఆసంపల్లి శ్రీనివాస్ కూడా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకోవడంతో పెద్దపల్లి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో పోటా పోటీ పెరిగిపోయింది,గడ్డం వివేక్ వెంకటస్వామి (వంశీ) మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా,ఆసంపల్లి శ్రీనివాస్,సుగుణకుమారి,బూడిద మల్లేష్ మాదిగ,సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో అధిష్టానం సమీకరణ చేస్తూ విశ్లేషిస్తుంది.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సమక్షంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెద్దపల్లి ఎంపీ టికెట్ రసవత్తరంగా మారింది.ఆసంపల్లి శ్రీనివాస్ కూడా రాష్ట్ర అధిష్టానంతో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు సన్నిహితుడుగా ఉండడం కూడా ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మరోపక్క మాజీ ఎంపీ సుగుణ కుమారి,బూడిద మల్లేష్ రాష్ట్ర అధిష్టానంతో ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉంటూ టికెట్ పై దృష్టి సారిస్తున్నారు.ఎవరికి టిక్కెట్ దక్కుతుందోనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,ఈ ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మాజీ ఎంపీలు వెంకటేష్ నేత,సుగుణ కుమారి పై నియోజకవర్గంలో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకుంది.వారు ఎంపీగా ఉన్న సమయంలో ఎనాడు ప్రజలకు చేరువుగా లేరనే వదంతులు బలంగా వినిపిస్తున్నాయి.గడ్డం వివేక్ కుమారుడు గడ్డo వంశీకృష్ణ రాజకీయలకు కొత్త కావడంతో అతని పైన ఎలాంటి ఆరోపణలు కానీ వ్యతిరేకత కానీ లేవు.అదే విధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ వ్యాపారవేత్త కావడంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానా వర్గానికి సన్నిహితులుగా పేరు ఉంది.ఆసంపల్లి.శ్రీనివాస్ కుటుంబం నేపథ్యం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని గోదావరిఖని ప్రాంతం కావడంతో పాటు అతని తండ్రి సింగరేణి ఉద్యోగి కావటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశించే వారు ఎవరు కూడా స్థానికులు కాకపోవడం కూడా ఆసంపల్లి శ్రీనివాస్ కు అనుకూలంగా ఉండే అవకాశానాలు మెండుగా కనిపిస్తున్నాయి.కాగా ఎఐసీసీ కార్యదర్శి,రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులు శ్రీనివాస్ కు మెండుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతిపక్ష పార్టీల నుండి నిలబెట్టే అభ్యర్థుల స్థితిగతులను పరిశీలించి టికెట్ కేటాయించిన విధంగా వేచి చూస్తుంది. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో అసంపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే దగ్గరుండి గెలిపించుకునే అవకాశం ఉంది.మాదిగ సామాజిక వర్గం చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు,రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు సంపూర్ణ మద్దతు ఉండడంతోపాటు పలువురు రాజ్యసభ సభ్యులు సైతం శ్రీనివాస్ పేరును అధిష్టానం వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.గడ్డం కాక కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికీ అవకాశం ఇవ్వడంతో ఒకే కుటుంబoలో మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఇవ్వటంలో వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుంది.పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆసంపల్లి శ్రీనివాస్ కు మద్దతు పలుకుతున్నారు.ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం పరిశీలనల్లో మాల సామాజిక వర్గం నుండి గడ్డంవంశి,మాదిగ సామాజిక వర్గం నుండి ఆసంపల్లి శ్రీనివాస్ పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత,మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డ వంశీకృష్ణ,మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ లో ఎవరికి టికెట్ దక్కుతుందో…! ఏ అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందో వేచి చూడవలసి వస్తుంది.

Spread the love