నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అతి పెద్ద సమస్యగా ముందుకొచ్చిన నీట్ సమస్యను పరిష్కరించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. నీట్ సమస్య సున్నితమైనదనీ, ఈ అంశం పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభావితం చేసిందని ఆయన గుర్తుచేశారు. నీట్ అవకతవకలపై వచ్చిన వార్తా క్లిప్పింగ్‌లను ట్వీట్‌తో జత చేశారు.