పదవ తరగతి విద్యార్థులు పరీక్షలంటే ఎక్కువగా భయపడతారు. అయితే, తొలితరగతి నుంచీ పరీక్షలు రాస్తూనే ఉన్నారు. అంటే, పరీక్ష అనుభవం ఉంది. కానీ అప్పటికీ వారు ఎందుకు భయపడుతున్నారు? పరీక్షా భయం వెనుక ఉన్న కారణాలను పరిశీలిద్దాం.
1. పరీక్ష భయానికి మూలకారణాలు
ప్రతిఫల భయం (Fear of Results):: పదవ తరగతి పరీక్షలు జీవితం మీద ప్రభావం చూపుతాయని భావించడం, మంచి మార్కులు రాకపోతే అవకాశాలు తగ్గిపోతాయని భయపడటం.
సామాజిక ఒత్తిడి (Social Pressure):: తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు పెట్టే అంచనాలు ఎక్కువ కావడం.
ఆత్మవిశ్వాసం కొరత(Lack of Confidence):: తగినంత సిద్ధం కాలేదనే భావన కలగడం.
తీర్చలేని భయం(Uncontrollable Fear):: కొంత మంది పిల్లలు మితిమీరిన భయంతో పరీక్ష దగ్గరికి వచ్చినప్పుడు మానసిక ఆందోళనకు గురవుతారు.
2. అనుభవం ఉన్నా, భయం ఎందుకు?
పెద్దదైన మార్పు(Major Shift): చిన్న తరగతుల్లో పరీక్షలు సాధారణంగా అంత ప్రెషర్ ఉండవు. కానీ పదవ తరగతిలో ఉన్నత చదువులకు ఇది మైలురాయి.
కంపారిజన్(Comparison): ఇతరులతో పోల్చడం వల్ల భయం పెరుగుతుంది.
దుష్ప్రభావాలు(Negative Thoughts):”తప్పు చేస్తే ఏమవుతుందో?” అనే భయం మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
3. అసలైన పరీక్ష భయం ఏమిటి?
విద్యార్థులు భయపడే పరీక్షలు చదువుకు సంబంధించినవి. కానీ జీవితంలో ఎదురయ్యే అసలైన పరీక్షలకు ముందు అనుభవం ఉండదు. అంటే, పదవ తరగతి పరీక్షలు భయపడాల్సినవే కావు. జీవితంలోని అసలైన పరీక్షలు అవి కాదు, నిజ జీవిత సవాళ్లు మనం ఎదుర్కొనాల్సిందే.
స్కూలు స్థాయిలో జరిగే పరీక్షలు, అసైన్మెంట్లను కూడా చాలామంది తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకుంటారు. వాటిలో అద్భుతంగా మార్కులు వచ్చేయాలనే అభిప్రాయాన్ని పిల్లలకు కల్పిస్తారు. పిల్లలు ఆ భయాందోళనలతో రాయగల్గిన వాటిని కూడా సరిగా రాయరు. మార్కులు రావు. తిట్లకూ గురవుతుంటారు. ఇది సర్వసాధారణంగా ప్రతీ ఇంటా కనిపించే దశ్యం. ఒక్కటి గుర్తుంచుకోవాలి… తరగతిలో పెట్టే పరీక్షలు లేదా ఇచ్చే అసైన్మెంట్లు క్వార్టర్లీ, హాఫ్యర్లీ పరీక్షలకు సిద్ధపడేందుకు ఉపయోగపడతాయి. అంతేగాని అవే సంవత్సరాంతం పరీక్షలు కావు. పరీక్షలు వారానికో, పదిహేను రోజులకొకసారో పెట్టడంలో అర్ధం అప్పటివరకూ నేర్చిన పాఠాలు ఎంతవరకూ క్షుణ్ణంగా వచ్చు, ఎవరు ఎందుకు వెనకబడివున్నారో ఉపాధ్యాయులు, టీచర్లు తెలుసుకోవడానికి పెట్టేవి. బాగా రాస్తూంటే సరే. బాగా రాయకుంటే మాత్రం తిట్టి, కొట్టి అవమానించాల్సిన అవసరం మాత్రం లేదు.
పరీక్షలు ఎలా రాయాలి, ఎంత బాగా రాయవచ్చు అనే అంశాలు స్కూలు స్థాయి, తరగతి స్థాయిల్లో జరిగే పరీక్షలు, అసైన్మెంట్ల ద్వారానే పిల్లలు తెలుసుకో గలరు. అందుకనే వీటికి తప్పకుండా హాజరుకావాలి. వీటిలో చేసిన పొరపాట్లను సరిదిద్ది బాగా రాయడానికి టీచర్లు మార్గాన్వేషణ చేయడానికి వీలుంటుంది. కనుక టీచర్లతో వీలైనంత సత్సంబంధాలు కలిగివుండాలి. టీచర్లకే పిల్లల చదువులోని లోటుపాట్లు తెలుస్తాయి. వారే సరిగ్గా లోపాలను వివరించగలరు. టీచర్-పేరెంట్ సమావేశాలకు తల్లిదండ్రులు వెళ్లాలి. అపుడే అనుమానాలు నివత్తి అవుతాయి. లేకుంటే ఎన్నటికీ పిల్లల చదువు లోపాలు గ్రహించరు.
పిల్లలకు లేనిపోని భయాలు, భ్రమలు కల్పించవద్దు. ముందు టీచర్లతో జరిగే సమావేశాల్లో మీ అభిప్రాయాలో, ఆందోళనో వ్యక్తం చేయండి. అపుడు స్కూల్లో పిల్లల ప్రవర్తన, చదువు స్థాయి టీచర్లు చెబుతారు. దాన్ని అనుసరించి పిల్లల భయాందోళనలు తొలగించే మార్గాలు వారు సూచించినట్టు పాటించండి. తరగతి గదిలో ఎక్కువ సమయం ఉంటారు కాబట్టి పిల్లల సంగతి టీచర్లకే బాగా తెలుస్తుంది. పరీక్షలు ఒకసారి సరిగా రాయనంత మాత్రాన మీ పిల్లలు చదువు నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకోకూడదు. ఆ భావన నుంచి బయట పడండి.
పరీక్షా భయాన్ని అధిగమించే మార్గాలు
పాజిటివ్ మైండ్‌సెట్ (Positive Thinking):: పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు, అవి అవకాశాలను మాత్రమే కలిగిస్తాయి.
సరిగ్గా ప్రిపేర్ అవ్వడం (Proper Preparation): మంచి ప్రణాళికతో చదవడం భయాన్ని తగ్గిస్తుంది.
రిలాక్సేషన్ టెక్నిక్స్ (Relaxation Techniques): ధ్యానం, యోగా, స్కిప్పింగ్ వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి.
తల్లిదండ్రుల ప్రోత్సాహం(Parental Encouragement):: పిల్లల మీద ఒత్తిడి పెంచకుండా, వారిని మోటివేట్ చేయాలి.
పరీక్షలు అనుభవం ఉన్నప్పటికీ, వాటి ప్రాముఖ్యత పెరిగినప్పుడు విద్యార్థులు భయపడతారు. అయితే, పరీక్షలను జీవితంలో సాధారణంగా తీసుకుంటే, భయం తగ్గిపోతుంది. అసలైన పరీక్షలు విద్యార్థి జీవితంలోనే మొదలవుతాయి. కాబట్టి, ఈ పరీక్షలు ఓ సాధారణ అనుభవంగా తీసుకుని ముందుకెళ్లాలి.
ఎక్కువ మార్కులు సాధించడమెలా?
విద్యార్థులు చాలామంది దీన్ని గురించి తెగ ఆలోచిస్తూంటారు. ట్యూషన్లో బాగా చదవడం, రాయడం ఒక్కటే సరిపోతుందనుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాయడంలో మెళకువలు నేర్చుకోవడంపై ఎక్కువ దష్టి పెట్టాలి. మార్కులు బాగా రావాలంటే సమాధానాలు వీలైనంత బాగా, వివరంగా అర్ధమయేలా రాయాలి. అనవసర వివరణ ఇవ్వడం మంచిదికాదు. సమయం కూడా వధా అవుతుంది. పరీక్షా సమయం పూర్తిగా రాయాలి. చివర్లో సమయం వుంటే, ఒక్కసారి రాసినవన్నీ పరిశీలించుకుని, పొరపాట్లు వుంటే అవీ చిన్నవైతే మళ్లీ అక్కడ రాయడానికి ప్రయత్నించండి. అంతేతప్ప దిగులు పడవద్దు. బాగా వచ్చినవి ఎంతో బాగా రాస్తే అవే మంచిమార్కులు తెస్తాయి. అదే ధీమాతో వుండండి. ఈ విధానం పాటించండి..
1. సబ్జెక్టు మూలాలు క్షుణ్ణంగా తెలుసుకోండి.
2. మార్కులకోసం చదవద్దు.
3. ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి అర్ధంచేసుకోండి. అపుడే స్పష్టంగా, వివరంగా సమాధానాలు రాయగలరు.
4. సమాధానాలు రాయడంలో ఒక క్రమపద్ధతని అనుసరించండి.
5. వీలయినంత గుండ్రంగా రాయాలి. లేకుంటే మార్కులు తగ్గే అవకాశం వుంటుంది.
6. వేగంగా రాయాలని నియమం పెట్టుకోవద్దు. బాగా రాయాలన్న భావనతోన వుండాలి. అపుడే వివరంగానూ రాయగలరు.
7. రానివాటిమీద ఎక్కువ సమయం వధా చేయవద్దు.
8. పరీక్షల ముందు మంచి ఆహారం తీసుకోండి.
ఈ విధమైన మార్గాలు కచ్చితంగా అనుసరిస్తే స్కూలు విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు సాధించగలరు. పిల్లలూ ప్రయత్నించండి. ముందుగా మీమీ తరగతిలో జరిగే చిన్న పరీక్షల నుంచే పాటించడం ఆరంభించండి. మంచి ఫలితాలు అందుకుంటారు.
”భయం అన్నది మనసులోనే ఉంటుంది, మన విశ్వాసం దాన్ని ఓడించగలదు!”
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్