– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఇరవై సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రతి శివరాత్రి కి దర్శించుకుంటున్న భవిష్యత్ లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మహా శివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి లో స్వయం భూ రాజ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం అంత ప్రాజెక్టు లు పూర్తి అయి మంచి పంటలతో సుభిక్షంగా ఉండలని, అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండలని ఆ రాజ రాజేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులకు సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వర త్వరగా క్యు లైన్ లలో ఉన్న భక్తులను దర్శనానికి పంపించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వర స్వామి హుస్నాబాద్ ప్రాంత వాళ్ళే కాదు ఇతర జిల్లాల వాళ్ళు కూడా కొంగు బంగారం అన్నారు. పెద్ద ఎత్తున ప్రతి సోమవారం స్వామి వారిని దర్శించుకుంటారని అన్నారు. ఆరెపల్లి నుండి పందిల్ల వరకు వయ పొట్లపల్లి మీదుగా డబుల్ రోడ్డు వేసినట్టు తెలిపారు .భక్తులకు శాశ్వత డ్రింకింగ్ వాటర్ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.