బస్టాండ్ నిర్మాణం పనులు ఈసారైనా పూర్తి అయ్యేనా.!

– 15 సంవత్సరాల నుండి కూడా నేటికీ అభివృద్ధికి నోచుకోని మిరుదొడ్డి బస్టాండ్ నిర్మాణం పనులు
– నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు 

– మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ప్రయాణికులు
నవతెలంగాణ  – మిరుదొడ్డి 
బస్టాండ్ నిర్మాణం పనులు గత 15 సంవత్సరాల గడుస్తున్న బస్టానిర్మాణ పాలు ఎక్కడికక్కడే మార్గమధ్యలో నిలిచిపోయాయి. బస్టాండ్ నిర్మాణం పనులు నేటికీ 15 సంవత్సరాలు పూర్తయినా కూడా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ యొక్క బస్టాండ్ నిర్మాణం పనులు అసంపూర్తి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ లో ప్రయాణికులు వెళ్లకుండా నిరుపయోగంగా ఉన్న వాహనాలకు అడ్డాగా మారింది. ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ ను ఉన్నతాధికారులకు ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా మారిపోయింది.  గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా ఈ యొక్క బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తికాలేదు .నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కూడా ఈ యొక్క బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తయితాయని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ ను ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యంతో ఈ యొక్క పనులు నిరుపేవంగా మారింది. దీంతో నిత్యం ఏదో ఒక పనిమీద మండల కేంద్రానికి వచ్చిన చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జూన్ మాసంలో  మరోవైపు పాఠశాల తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు బస్టాండ్ నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో రాత్రి సమయంలో కూడా రోడ్ పైనే బస్సు కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. బస్టాండ్ లో వాహనాలు నిలపడంతో ఎక్కడి వస్తువులు అక్కడే నిండిపోయి ఉన్నాయి విద్యార్థులు రోడ్డుపైనే ఉండి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒకవైపు విద్యార్థులు మరొక ప్రయాణికులు నిత్యం నరకం చూడాల్సిన పరిస్థితి మండల కేంద్రంలో కనబడుతూనే ఉంది ఇట్టి విషయంపై ఉన్నత అధికారులకు తెలిపిన పట్టించుకోకపోవడం ఏంటని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లి, మిరుదొడ్డి ,చెప్పాలా బొంపల్లి తో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రయాణికులు బస్టాండ్ సరిగా లేకపోవడంతో వర్షానికి మరియు ఎండకు ఎక్కడ ఉండాలో తెలియని స్థితి నెలకొన్నది. మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొంటే గ్రామాల్లో ఎలా ఉందని ప్రయాణికులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కనీసం మండల కేంద్రంలో కూడా బస్టాండ్ ఆవరణలో కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు  లేకపోవడంతో మహిళలకు విద్యార్థులకు తీర ఇబ్బంది గురవుతున్నట్లు తెలుస్తుంది .ఇటి విషయాన్ని ఉన్నతాధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు కూడా తెలిపిన నేటికీ పట్టించుకోవడం లేదు.
మిరుదొడ్డి మండల కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు లేవు :
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది.. ఆకుల మల్లేశం మిరుదొడ్డి ఆటో డ్రైవర్
మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం పూర్తికాలేదు 10 సంవత్సరాలు అవుతున్న ఈ యొక్క బస్టాండ్ పనులు పూర్తికాక పోవడంతో ఇబ్బందులు గురవుతున్నాం .రోజు విద్యార్థులు మహిళలు ప్రయాణికులు రోడ్డుపై నిలబడి నిలబడుతున్నారు కనీసం ఇక్కడ మహిళలకు విద్యార్థులకు మూర్త చాలు లేకపోవడంతో తీరా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క విషయాన్ని సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఎంపీడీవోలకు తెలిపిన ఎవరు పట్టించుకోవడం లేదు.
బస్టాండ్ లో పూర్తిగా నీళ్ళు నిండిపోయాయి :
దోమలు ఎక్కువగా కావడంతో అనారోగ్య బారిన పడుతున్నాం: పిట్ల రాములు మీరు దొడ్డి గ్రామస్తుడు
మిరుతోటి మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ లో పైపు లీక్ కావడంతో గత నెల రోజులు గడుస్తున్నా ఇక్కడ గుంతను పూడ్ చేయడం లేదు బస్టాండ్ ఆవరణలో పూర్తిగా బురదమయం కావడంతో దోమలు ఎక్కువగా అవుతున్నాయి చుట్టుపక్కల ఉన్న వారికి అనారోగ్య బారిన పడుతున్నాం ఈ యొక్క విషయాన్ని గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారు . దోమలు ఎక్కువ కావడంతో. జ్వరాలు మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఉన్నతాధికారులు పట్టించుకోవడం పోవడం సరికాదు.
ఎంపీడీవో గణేష్ రెడ్డి :
ఈ విషయాన్ని మా దృష్టికి వచ్చింది వాస్తవమే త్వరలో ఆ మురికి ఈ విషయాన్ని మా దృష్టికి వచ్చింది వాస్తవమే త్వరలో ఆ మురికి గుంతను పూడ్చివేస్తాము పంచాయతీ సిబ్బందికి తెలపడం జరిగింది వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాం.
Spread the love