
నవతెలంగాణ-ముత్తారం : ప్రజల మేలుకోరే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ముత్తారం వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్ రావు అన్నారు గురువారం మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచారంలో వారు మాట్లాడుతూ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే ప్రజల వద్ద నమ్మకం కోల్పోయిందన్నారు. ప్రజలందరూ ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట ముత్తారం గ్రామం శాఖ అధ్యక్షులు అలువోజు రవీందర్ చారి.బేధ సంపత్. చల్ల రాజేందర్. చల్ల సమ్మయ్య. రాగుల రవీందర్. రాగుల రాజేశం. కలవైన బాలమల్లు. తూటి లచ్చయ్య.అమ్ము కుమార్. మారం రామ్ రెడ్డి.పరుపాటి వీరారెడ్డి.ఆల్గం రాజయ్య. మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.