నేటి సాయంత్రం నుంచి వైన్స్ బంద్

నవతెలంగాణ-హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు.

కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్  నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

Spread the love