- Advertisement -
సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్
నవతెలంగాణ-హైదరాబాద్ : సిఐఎస్‌సీఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అండర్-15 బాయ్స్ విభాగంలో విజేతగా ఎన్‌ఏఎస్‌ఆర్ బాయ్స్ స్కూల్ (గచ్చిబౌలి) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ 1-0తో గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్‌పై 1-0తో నెగ్గిన ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్.. లీగ్ దశలో హెపిఎస్ బేగంపేట్‌పై 2-0తో, శివ శివాని పబ్లిక్ స్కూల్‌పై 3-0తో వరుస విజయాలు నమోదు చేసింది.
- Advertisement -



