
తుమ్మలపల్లి జాతర పురస్కరించుకొని తుమ్మలపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతి బంగారుగడ్డ టీం గెలుచుకుంది. ద్వితీయ బహుమతి తుమ్మలపల్లి టీం గెలుచుకోగా తృతీయ బహుమతి చండూర్ కింగ్ స్టార్ టీం గెలుపొందాయి. ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన తుమ్మలపల్లి టీం 10 ఓవర్లలో 43పరుగులకు ఆల్ అవుట్ అయింది. తుమ్మలపల్లి టీం నుంచి కేశవులు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 20 పరుగులను సాధించాడు. బ్యాటింగ్కు దిగిన బంగారుగడ్డ 6 44 పరుగుల లక్ష్యాన్ని చేదించి టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. మనది సిరీస్ అవార్డును బంగారుగడ్డ టీమ్ సభ్యుడు మాదగోని దీపు కుమార్ గెలుచుకున్నాడు. గవర్నమెంట్ ఆర్గనైజర్ కాశమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ టోర్నమెంట్కు సహకరించిన దాతలకు మరియు పాల్గొన టీమ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు తుమ్మలపల్లి జాతరకు విచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరారు.