‘మనం చెట్లను కాపాడితే… చెట్లు మనల్ని కాపాడతాయి’ అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, ‘చెట్ల రామయ్య’ అలియాస్ ‘వనజీవి రామయ్య’గా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం పొందిన దరిపల్లి రామయ్య జీవితానికి ‘వనజీవి రామయ్య’ పేరుతో దశ్యరూపం ఇచ్చారు నూతన నిర్మాత బూసం రవీంద్రనాధ్.
‘వక్షో రక్షతి రక్షిత’ అనే ట్యాగ్ లైన్‌తో నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో బి.ఆర్.మూవీస్ బ్యానర్ పై రవీంద్రనాధ్ నిర్మించిన ఈ 40 నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రం… షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు దక్కించుకుంది.
నిర్మాతగా తన తొలి ప్రయత్నమే విజయవంతం కావడంతో… త్వరలో రెండో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు బూసం రవీంద్రనాధ్. కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.పి.టి.సి.గా ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రనాధ్ స్వతహాగా స్థిరాస్తి వ్యాపారి. సినిమాలంటే చిన్నప్పటి నుంచి మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘వనజీవి రామయ్య’ చిత్రంలో ఒక చిన్న పాత్ర సైతం పోషించారు. ప్రస్తుతం తన రెండో చిత్రం కోసం కథాచర్చలు జరుపుతున్న రవీంద్ర త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘వనజీవి రామయ్య’గా టైటిల్ రోల్‌తో మెప్పించిన సీనియర్ నటుడు బ్రహ్మాజీతోపాటు ఈ చిత్రం రూపకల్పనలో దర్శక,నిర్మాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కతజ్ఞతలు తెలిపారు.
ఆ.. ప్రోత్సాహంతో మరో చిత్రానికి సన్నాహాలు
- Advertisement -
- Advertisement -



