కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే పేదలకు సన్న బియ్యం..

– బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-సారంగాపూర్: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.సోమవారం మండలకేంద్రంలో రేషన్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడరు.. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం  అందించాలని పీఎం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా కరోనా సమయం నుండి దేశ వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీకి సహకరిస్తుందని అన్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ నుండి మార్కండేయ స్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, జిల్లా, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love