
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆల్కలాంబ పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో ఈనెల 14వ తేదీన డిల్లీలో జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు బయలు దేరారు. బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి శనివారం మంథని నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ సభ్యులు మండల మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కొండ రాజమ్మ, మహాదేవపూర్ మాజీ ఎంపిటిసి సభ్యురాలు జాడి మహేశ్వరి, కాటారం గ్రామశాఖ అధ్యకురాలు ఎడ్ల పొసక్క, మహాదేవపూర్ మండల అధ్యకురాలు బందెల సత్యమ్మ బయలుదేరారు.