అన్ని రంగాలలో మహిళలు పురోగతి సాధించాలి

Women should make progress in all fields.నవతెలంగాణ – ఆర్మూర్
నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించాలని క్షత్రియ సమాజ్ అధ్యక్షులు బచ్ఛేవాల్ రెడ్డి ప్రకాష్, మాజీ కౌన్సిలర్, న్యాయవాది, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ మహిళా మండలి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్ అన్నారు. పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం క్షత్రియ సమాజానికి చెందిన మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు.. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో మాట్లాడుతూ కుటుంబానికి దిక్సూచి వంటి మగువలు సమాజానికి సైతం బాసటగా ఉండాలన్నారు. ఈరోజు మగవారితో సమానంగా మహిళలు చైతన్యవంతులై అన్ని రంగాలలో రాణిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. రాబోయే రోజులలో క్షత్రియ సమాజానికి చెందిన మహిళలు సంఘటితంగా ఉండి పేద ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్సాహభరితంగా ఆటపాటలలో పాల్గొన్నారు. గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా క్షత్రియ ప్రాంతీయ సమాజ్ మహిళా మండలి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగీతా ఖాందేష్ కు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ కు చెందిన యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్సులు సాత్ పూతే సంతోష్, దుమాని నీరజ్, మహిళా మండలి అధ్యక్షురాలు డీజే సులోచన, ఎమ్ సి మెంబర్స్ గటడి స్వాతి, అల్జాపూర్ రాజా సులోచన, , బొచ్కర్ వీణ, మహిళా మణులు హాజరీ అనసూయ, సాత్ పుతే మంజుల, గుజరాతీ లక్ష్మి, శాంతి, ప్రభావతి, పద్మ, లత, లలిత, సునీత, అంబిక, కవిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love