ఎయిడ్స్ రహిత సమాజా నిర్మాణానికి కృషి..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
నెహ్రు యువ కేంద్రం నల్గొండ, ఉమ్మడి నల్లగొండ కి చెందిన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎస్ వి డిగ్రీ కాలేజీ సెమినార్ హాల్ లో ఎయిడ్స్ పై యువతకు అవగాహన  కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి యువత ఇలాంటి అవగాహన సదస్సులను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. యువత తమ తమ గ్రామాల్లో  ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత  సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్ర నియంత్ర సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధాకర్, సంపతయ్య  వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాస రచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి మొదటి, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ సదస్సులో ఉమ్మడి జిల్లా ఎన్ వై కే యువజన అధికారి ప్రవీణ్, కొండ నాయక్, వలంటీర్ మణికంఠ, మధు,కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love