డ్రగ్స్, గంజాయి రహిత సమాజానికి కృషి

Working towards a drug and cannabis free society– జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య
నవతెలంగాణ – సిరిసిల్ల
డ్రగ్స్,గంజాయి రహిత సమాజానికి అందరం కలిసి కృషి చేద్దామని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మిని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని శనివారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నమని వివరించారు.  గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, వీటికి అలవాటు పడితే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, అనేక ఇబ్బందులు తప్పవని సూచించారు. డ్రగ్స్‌ వినియోగం దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్‌ మీడియాతోపాటు కళాశాలలు, పాఠశాల లలో అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూల  కోసం లైన్ డిపార్ట్మెంట్స్ ఒకటిగా కలిసి పనిచేయాలని తెలిపారు..ప్రతి స్కూల్ కాలేజీలలో మత్తు పదార్ధాల నిర్ములన కు కమిటీలను కొనసాగిస్తూ, విద్యార్థులు కు అన్ని రకాల మాదక ద్రావ్యల దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు , జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు వాలంటీర్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేయాలని కలెక్టర సూచించారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాల మండల జిల్లా స్థాయిలో విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేకతపై  వ్యాసరచన,డిబేట్, పోటీలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో  ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, డీఈఓ రమేష్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ రాజ గోపాల్, డీఏఓ అఫ్జల్ బేగం, సిరిసిల్ల ఎఫ్ఆర్ఓ కల్పన దేవి అధికారులు పాల్గొన్నారు.

Spread the love