ప్రపంచ రుతుక్రమ దినోత్సవం..

– బాలికలకు ఉచితంగా కిట్ ల పంపిణీ..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రపంచ రుతుక్రమ  దినోత్సవాన్ని సీ- త్రీ ఇండియా సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో మంగళవారం చూడి బజార్ లోని కమిటీ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనురాధ  ఉచితంగా బాలికలకు నవ్య కిట్ బ్యాగులు, సానిటరీ ప్యాడ్ లు, వాషింగ్ లిక్విడ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌమార దశ యుక్త వయసులో శరీరంలో సంభవించే మార్పుల గురించి తెలియజేశారు. మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అన్నారు.రుతుక్రమంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి హెచ్ ఎన్ శారద, ఏ ఎన్ ఎం లు,ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love