ట్రంప్ పర్యటనకు ఫిలిప్పీన్స్‌లో తీవ్ర వ్యతిరేకత
యుద్ధం ఆపాలని, అమెరికా జోక్యం వద్దని ప్రజల ఆందోళనలు
మరోవైపు చైనా వైపు ఆసియాన్ దేశాల వాణిజ్య అడుగులు
ప్రాంతీయ ఐక్యత, స్వేచ్ఛా వాణిజ్యానికి లీ కియాంగ్ పిలుపు
క్వాడ్ సమావేశానికి మోడీ..అమెరికా వ్యూహాలకు భారత్ మద్దతుపై చర్చ
మనీలా : ఆసియా దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా సాగిస్తున్న రాజకీయ, ఆర్థిక వ్యూహాలకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందే వామపక్ష సంఘాలు, విద్యార్థులు, కార్మికులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని నిలిపివే యాలనీ, అమెరికా నేతృత్వంలోని వ్యూహాత్మక కార్యక్ర మాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చైనా మాత్రం ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకుం టూ ప్రాంతీయ ఐక్యతకు పిలుపునిస్తోంది. ఈ పరిణామా ల మధ్య ప్రధాని మోడీ కూడా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతుండటం ప్రాధాన్యం సంతరిం చుకుంది. చైనా ప్రధాని లీ కియాంగ్ సోమవారం మనిలాలో జరిగిన ఆసియాన్ దేశాల సమావేశంలో మాట్లాడుతూ..
ప్రపంచవ్యాప్తంగా ఏకపక్ష విధానాలు, రక్షణాత్మక వాణిజ్య ధోరణులు, అంతర్జాతీయ ఘర్షణలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, ఆగ్నేయాసియా దేశాలు ఐక్యంగా ఉండాలనీ, బయటి దేశాల జోక్యాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గతేడాది చైనా, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం లక్ష కోట్ల డాలర్లకు మించిందనీ, ఇరువైపులా మొత్తం పెట్టుబడులు 500 బిలియన్ డాలర్లు దాటాయని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్యం, బహుళపక్ష విధానాలను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
అమెరికా విధానాలపై నిరసన
ట్రంప్ మనీలాకు చేరుకోనున్న నేపథ్యంలో నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధంలో అమెరికా పాత్రను నిరసిస్తూ, అమెరికా నేతృ త్వంలోని 'పాక్స్ సిలికా' కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చైనా-ఆసియాన్ సంబంధాలు బలోపేతం
చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే ఆసియాన్‌లోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అమెరికాతోనూ సంబంధాలను విస్తరించుకోవాలని చూస్తున్నాయి. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశ పాలకులను ఆసియాన్ సమావేశాలకు దూరంగా ఉంచే విధానాన్ని కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. శాంతి ప్రణాళికపై స్పష్టమైన పురోగతి సాధిస్తే తిరిగి అవకాశం కల్పిస్తామని తెలిపారు.
'క్వాడ్' సమావేశంలో మోడీ
ట్రంప్ మనీలా పర్యటనలో భాగంగా ఆసియాన్ దేశాల నేతలతో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన 'క్వాడ్' సమావేశంలోనూ పాల్గొనను న్నారు. రెండేండ్ల తర్వాత ఈ కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పాల్గొననున్న సమావేశం కీలకంగా మారింది. ఆసియాలో అమెరికా వ్యూహాలకు భారత్ ఎంతవరకు మద్దతు ఇస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.







కామెంట్‌లు (0)