Magazines

దీపావళిని గుర్తించిన చికాగో

3 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : దీపావళి పండుగను గుర్తిస్తూ చికాగో మేయర్‌ బ్రాండన్‌ జాన్సన్‌ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. పరిసర ప్రాంతాలను సుసంపన్నం చేస్తూ నగరంలో ఐక్యతను పెంపొందింపజేసే విభిన్న సాంస్కృతిక, మతపరమైన వేడుకలను జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి పండుగ హిందూ, జైన వర్గాలకు లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కల్పించిందని, వారు ఈ పండుగను తమదైన ప్రత్యేక ఆచారాలు, పద్ధతుల్లో జరుపుకుంటారని ఆయన చెప్పారు. కాగా చికాగో నగరం ఉన్న కుక్‌ కౌంటీ బోర్డ్‌ ఆఫ్‌ కమిషనర్స్‌ కూడా ఇదే విధమైన ప్రకటన జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్