స్టార్‌లింక్ టెక్నాలజీ సాయంతోనే అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
మండిపడిన మస్క్...స్పేస్ ఎక్స్ సేవల వినియోగంపై కఠిన నిబంధనలు
టెహ్రాన్ : అమెరికాపై ప్రతీకార దాడులు చేయడానికి ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ను ఇరాన్ ఉపయోగించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాడుల మొదటి రోజే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సహా పలువురు అగ్ర నేతలు, సైనికాధికా రులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రతీకార్ఛేతో రగిలిపోయిన ఇరాన్ మార్చి మొదటి వారంలో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. ఆ సమయంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ఇరాన్ రెండు సార్లు ఉపయోగించుకున్నదని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలియజేసింది. స్టార్‌లింక్ సేవలను అనధికారికంగా ఇరాన్ వినియోగించుకోవడంపై మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం...అమెరికా స్థావరాలపై సైనిక దాడి జరపడానికి స్టార్‌లింక్‌ను ఇరాన్ దుర్వినియోగం చేసిందని మస్క్ బృందం నిర్ధారణకు వచ్చింది. ఇరాన్ చర్యకు రెండు నెలల ముందే అమెరికాకు శత్రువైన మరో దేశం కూడా యుద్ధంలో స్టార్‌లింక్ సేవలను వినియోగించుకోవాలని భావించగా ఆ ప్రయత్నాన్ని మస్క్ అడ్డుకున్నారు.
అమెరికాకు చుక్కలు
ఉక్రెయిన్ సైన్యానికి, ఇరాన్‌లోని అసమ్మతివాదులకు, తన మిత్రదేశాలకు అమెరికా ప్రభుత్వం స్టార్‌లింక్, స్టార్‌షీల్డ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అయితే అదే సమయంలో అమెరికా శత్రు దేశాలు కూడా స్టార్‌లింక్‌ను వినియోగించుకోగలుగుతున్నాయి. అది కూడా మస్క్ నియంత్రించలేని విధంగా జరిగిపోతోంది. వాస్తవానికి తక్కువ కక్ష్య కలిగిన ఉపగ్రహాల ద్వారా మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే స్టార్‌లింక్ పరికరాలను అనధికారికంగా వినియోగించుకోకుండా అడ్డుకోవడానికి మస్క్ అనేక చర్యలు చేపట్టారు. స్టార్‌లింక్ ఉపగ్రహ పరిజ్ఞానం వందలాది అధీకృత థర్డ్ పార్టీ రీసెల్లర్లతో కూడిన గ్లోబల్ ప్రోగ్రామ్ ద్వారా 160కి పైగా దేశాలకు అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించుకోవాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ ఇరాన్ వంటి అమెరికా శత్రు దేశాలు ఆ సేవలను వాడుకుంటూ వాషింగ్టన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. స్టార్‌లింక్ ఉపగ్రహ సేవలను కమాండ్ - కంట్రోల్ కోసం, లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగించే ఆత్మాహుతి డ్రోన్ కార్యకలాపాల కోసం ఇరాన్ ఉపయోగించిందని తెలుస్తోంది. అమెరికా సంప్రదాయ సమాచార వ్యవస్థలను బలహీనపరచాలని చూస్తున్న ఇరాన్‌కు స్టార్‌లింక్ ఓ ప్రత్యామ్నాయ సమాచార సాధనంగా ఉపయోగ పడుతోందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఏదేమైనా ‘నీ వేలితో నీ కన్నే పొడుస్తున్నాన’న్న రీతిలో ఇరాన్ ఎత్తుగడలు పన్నుతోంది. అమెరికా సాంకేతికతను ఉపయోగించుకుంటూ దాని బలగాల పైనే దాడులు చేస్తోంది. ఈ పరిణామం సహజంగా అమెరికాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వాషింగ్టన్ పైనా మస్క్ సీరియస్
స్టార్‌లింక్ ఉపగ్రహ టెక్నాలజీని అమెరికా సైన్యం ఉపయోగించడంపై కూడా మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షీల్డ్‌ను ఉపయోగించి అమెరికా సైన్యం ఆత్మాహుతి డ్రోన్‌లను ప్రయోగించడంపై మస్క్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పేసఎక్స్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు. స్టార్ లింక్, స్టార్‌షీల్డ్ సేవలను కొనుగోలు చేసే దేశాలపై స్పేస్‌ఎక్స్ తనిఖీలను ముమ్మరం చేశారు.







కామెంట్‌లు (0)