Magazines

కుప్పకూలిన ప్రయివేట్‌ జెట్‌ విమానం

1 గంట క్రితం

Private jet crashes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

తొమ్మిది మంది దుర్మరణం

ఫ్లోరిడా : అమెరికాలోని ఫ్లోరిడాలో లియర్‌జెట్‌-60 అనే ప్రైవేటు వ్యాపార విమానం ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. దక్షిణ ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ కౌంటీలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌ నుంచి బహమాస్‌కు వెళుతుండగా ఫ్లోరిడాలోని గ్రీన్‌ఏకర్స్‌ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయం సమీపంలో జనసమ్మర్దంగా ఉండే రోడ్డు పైకి విమానం నిలువుగా దూసుకొచ్చి పడిపోయింది. భూమిని ఢకొీన్న వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పేలిపోయింది. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో పైలట్‌ మాట్లాడారు. విమానంపై మంచు పేరుకుపోతోందని, నిమిషానికి 20 వేల నుంచి 32 వేల అడుగుల వేగంతో కిందికి పడిపోతున్నామని ఆయన ఆందోళనతో చెప్పారు. 'మాకు సమయం అయిపోయింది' అంటూ పైలట్‌ చెప్పిన చివరి మాటలు రికార్డయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. సమీపంలోని నీటి పైప్‌లైన్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల రీత్యా ఆ ప్రాంతంలోని 600 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రెడ్‌క్రాస్‌ సాయంతో షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదానికి వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు కారణమా లేక సాంకేతిక లోపం ఏదైనా తలెత్తిందా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్