అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా
కాలిఫోర్నియా : ఇరాన్‌లో సైనిక చర్యలకు నిధులు నిలిపివేయాలని కాలిఫోర్నియాకు చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా డిమాండ్ చేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, యుద్ధంపై ఓటర్లలో నెలకొన్న అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు. ఫాక్స్ న్యూస్ 'సండే' కార్యక్రమంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన రో ఖన్నా మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికల్లో తమకు మెజారిటీ లభిస్తే ఇరాన్‌లో చేపట్టబోయే తదుపరి సైనిక చర్యలకు నిధుల విడుదలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. గతంలో వియత్నాం యుద్ధాన్ని ముగించడానికి ప్రతినిధిసభ, సెనెట్ ఎలాగైతే నిధులను నిలిపివేశాయో ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి కూడా అదే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించాలని, గ్యాస్, డీజిల్ ధరలు మరింత పెరగాలని కోరుకునే ప్రజలు రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయవచ్చునని రో ఖన్నా వ్యాఖ్యానించారు.







కామెంట్‌లు (0)