ఒకరు మృతి
ఢాకా : బంగ్లాదేశ్‌లో పదవీచ్యుత మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పిలుపునిచ్చిన రెండు రోజుల లాక్‌డౌన్ హింసాకాండకు దారితీసింది. ఈ హింసాకాండలో అవామీ లీగ్ కార్యకర్త ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుండి ఈ లాక్‌డౌన్ ప్రారంభంకాగా, షరియత్‌పూర్‌లో పాలక బీఎన్‌పీ, అవామీ లీగ్‌ల మధ్య ఘర్షణలు నెలకొన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణల్లో అవామీ లీగ్ యువజన విభాగం కార్యకర్త ఇబ్రహీం సిపాహి మరణించారని అన్నారు.ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారని చెప్పారు. నిరసనకారులు ఒక రహదారిని దిగ్బంధించారని, దీంతో నైరుతి బంగ్లాదేశ్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే పద్మా వంతెన మీదుగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. డిసెంబర్ 16న తాను బంగ్లాదేశ్‌కి తిరిగి రానున్నట్లు షేక్ హసీనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా భద్రదతను కట్టు దిట్టం చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, దాడు లు, రహదారుల దిగ్బంధనాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ రాజకీయ కార్యకలా పాలపై నిషేధం కొనసాగుతోంది. 2024 ఆగస్టులో భారీ నిరసనల అనంతరం షేక్ హసీనా 15 ఏళ్ల పాలన ముగి యగా, ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం 2025 మే నెలలో ఈ నిషేధాన్ని విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం, అవామీ లీగ్‌పై నిషేధాన్ని కొనసాగించింది.






కామెంట్‌లు (0)